Share News

దొంగ ప్రేమికులు.. సినిమాలను తలదన్నేలా సెల్‌ టవర్లలో చోరీలు

ABN , Publish Date - Mar 26 , 2026 | 01:01 PM

దర్జాగా ఖరీదైన బైక్‌ను దొంగలించి దానిపైనే షికార్లు కొట్టిన ఓ ప్రేమజంట కథ ఇది. ఎక్కడా సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌కు దొరక్కూడదన్న ఆలోచనతో వాకీటాకీలతో మొత్తం తంతు నడిపించారు.

దొంగ ప్రేమికులు.. సినిమాలను తలదన్నేలా సెల్‌ టవర్లలో చోరీలు

  • కొట్టేసిన ద్విచక్ర వాహనంపై దర్జాగా షికార్లు

శ్రీకాళహస్తి(చిత్తూరు): దర్జాగా ఖరీదైన బైక్‌ను దొంగలించి దానిపైనే షికార్లు కొట్టిన ఓ ప్రేమజంట కథ ఇది. ఎక్కడా సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌కు దొరక్కూడదన్న ఆలోచనతో వాకీటాకీలతో మొత్తం తంతు నడిపించారు. అయితే పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేయడంతో చివరకు కటకటాల పాలయ్యారు.బుచ్చినాయుడుకండ్రిగ సీఐ తిమ్మయ్య కథనం మేరకు... నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం నాగమాంబపురానికి చెందిన కిరణ్‌ ఐటీఐ చదివాడు. అదే గ్రామానికి చెందిన రహేలు అనే యువతిని ప్రేమించాడు. ఓ సెల్‌ఫోన్‌ కంపెనీకి చెందిన టవర్‌ వద్ద టెక్నీషియన్‌గా పనిచేస్తున్న కిరణ్‌ ప్రవర్తన బాగాలేకపోవడంతో విధుల నుంచి తొలగించారు.


ctr5.jpgఆ కంపెనీపై ద్వేషం పెంచుకున్న కిరణ్‌ దానికి సంబంధించిన టవర్లలో పరికరాలు చోరీచేసేందుకు ప్రియురాలితో కలిసి పథకం రచించాడు.దొరక్కుండా ఉండేందుకు సెల్‌ఫోన్లు వాడకుండా వాకీటాకీలను ఉపయోగించాలనుకున్నారు.చోరీ సమయంలో ఎవరైనా అడ్డుపడితే బెదిరించేందుకు డమ్మీతుపాకీని సైతం సిద్ధం చేసుకున్నారు. నెల్లూరులో ఓ ఖరీదైన ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసి దానిపై షికార్లు చేస్తూ గడిపేది ఈ జంట. సెల్‌ఫోన్‌ టవర్లలో విలువైన రోటార్‌ పరికరాలను చోరీ చేసే ఈ జంట చెన్నైలో అమ్మి వచ్చిన సొమ్ముతో జల్సాగా ద్విచక్రవాహనంలో తిరిగేవారు.


ctr5.2.jpgగత రెండు నెలల వ్యవధిలో తొట్టంబేడు,పెద్దకన్నలి, బుచ్చినాయుడుకండ్రిగల్లో ఉన్న మూడు టవర్లలో వరుసగా రోటర్లు చోరీ జరగడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.నెల్లూరు జిల్లాలోనూ పలుచోట్ల అదే కంపెనీ టవర్లలో చోరీలు జరగాయి. మొత్తం 18 చోట్ల రోటర్స్‌ను ఈ ప్రేమజంట దొంగలించింది. బుచ్చినాయుడుకండ్రిగ సీఐ తిమ్మయ్య సాంకేతిక పరిజ్ఞానంతో చాకచక్యంగా ప్రేమజంటను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రెండు రోటర్లు, రెండు వాకీటాకీలు, డమ్మీగన్ను, చోరీ చేసిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.తమిళనాడులో విక్రయించిన 16రోటర్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.40లక్షల విలువైన పరికరాలను చోరీ చేసినట్లు నిర్ధారించారు. ప్రేమజంటను అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఏపీలో ఇంటర్ సెకండియర్ సిలబస్ లీక్.. రంగంలోకి సైబర్ క్రైమ్ పోలీసులు

ఏప్రిల్‌ 1 నుంచి చికెన్‌ షాపులు బంద్‌!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 26 , 2026 | 01:01 PM