బాధ్యులైన వారిపై కఠిన చర్యలు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
ABN , Publish Date - Mar 26 , 2026 | 11:48 AM
మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాద ఘటనా స్థలిని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. బస్సు ప్రమాద ఘటన బాధాకరమని, మృతుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి తెలిపారు.
మార్కాపురం, మార్చి 26: ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాద ఘటన బాధాకరమని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి(Minister Mandipalli Ramprasad Reddy) అన్నారు. ఈరోజు ఉదయం బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రమాదంలో 13 మంది మరణించారని... మృతుల కుటుంబాలను ఆదుకుంటామని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని మంత్రి వెల్లడించారు. కర్నూలు ఘటన జరిగిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామని.. ట్రావెల్స్ బస్సుల తనిఖీలు నిర్వహిస్తున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
బస్సు ప్రమాదంపై మంత్రి సుభాష్ దిగ్భ్రాంతి
మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాదంపై మంత్రి వాసంశెట్టి సుభాష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఘటనాస్థలిలో బాధితులకు అన్ని రకాల సహాయ చర్యలు అందించాలన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచనలు చేశారు.
ఇవి కూడా చదవండి...
కుప్పంలో మూడో రోజుకు నారా భువనేశ్వరి పర్యటన
మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం సమీక్ష.. కీలక ఆదేశాలు
Read Latest AP News And Telugu News