Share News

మార్కాపురం బాధితులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ

ABN , Publish Date - Mar 26 , 2026 | 11:20 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రకాశం జిల్లాలోని మార్కాపురం సమీపంలో జరిగిన ప్రమాదం అత్యంత విషాదకరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.

మార్కాపురం బాధితులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ
Narendra Modi Announces Ex-Gratia for Markapuram Accident Victims

న్యూ ఢిల్లీ, మార్చి 26: ఆంధ్రప్రదేశ్‌‌లోని మార్కాపురం సమీపంలో జరిగిన ప్రమాదం అత్యంత విషాదకరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని, ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్ గ్రేషియా పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఈ మేరకు పీఎంఓ కార్యాలయం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.


ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రకాశం జిల్లాలోని మార్కాపురం మండలం రాయవరం సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును టిప్పర్ ఢీకొన్న ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటనలో పలువురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రమాదంపై స్పందిస్తూ, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించింది. జిల్లా కలెక్టర్, ఎస్పీ స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

బాధితుల వివరాలు:

Markapuram Accident Victims.jpg


ఈ వార్తలు కూడా చదవండి:

సీఎం రేవంత్‌ కేరళ పర్యటన రద్దు

ఏప్రిల్‌ 1 నుంచి చికెన్‌ షాపులు బంద్‌!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 26 , 2026 | 11:55 AM