Share News

సీఎం రేవంత్‌ కేరళ పర్యటన రద్దు

ABN , Publish Date - Mar 26 , 2026 | 05:26 AM

సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం చేపట్టాల్సిన కేరళ పర్యటన అనివార్య కారణాల వల్ల రద్దయింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోజికోడ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ..

సీఎం రేవంత్‌ కేరళ పర్యటన రద్దు

హైదరాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం చేపట్టాల్సిన కేరళ పర్యటన అనివార్య కారణాల వల్ల రద్దయింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోజికోడ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ తరపున ప్రచారంలో రేవంత్‌ రెడ్డి పాల్గొనాల్సింది. వాస్తవానికి రాహుల్‌గాంధీ కోజికోడ్‌లో పర్యటించాలి. అయితే సోనియాగాంధీ అస్వస్థతకు గురవడంతో ఆయన రాలేకపోయారు. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ స్థానంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిందిగా కేరళ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ రేవంత్‌రెడ్డిని ఆహ్వానించింది. దీంతో ప్రత్యేక విమానంలో వెళ్లి ప్రచారంలో పాల్గొని తిరిగి రావాలని రేవంత్‌ భావించారు. కానీ, సమయాభావం, ఇతరకారణాల వల్ల పర్యటన రద్దయింది.

Updated Date - Mar 26 , 2026 | 05:26 AM