బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయ్..
ABN , Publish Date - Mar 26 , 2026 | 11:27 AM
కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి, వెండి ధరలు మళ్లీ ఊపందుకుంటున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గడంతో పసిడికి మళ్లీ రెక్కలు వస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి, వెండి ధరలు మళ్లీ ఊపందుకుంటున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గడంతో పసిడికి మళ్లీ రెక్కలు వస్తున్నాయి. నేడు (గురువారం) మధ్యాహ్నం 11:20 గంటలకు 24 క్యారెట్ల పసిడి గ్రాముకు రూ.22ల మేర పెరిగి రూ.14,689కి చేరింది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ ధర గ్రాముకు రూ.20లు పెరిగి రూ.13,465గా ఉంది. ఇక, 18 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.16లు పెరిగి రూ.11,017 వద్ద కొనసాగుతోంది. వెండి ధర కిలోకు రూ.250 పెరిగి రూ.2.50లక్షలకు చేరుకుంది.
ప్రధాన నగరాల్లో 10 గ్రాములకు ధర ఎలా ఉందంటే (24 క్యారెట్లు, 22 క్యారెట్లు)
చెన్నై: రూ.1,49,130, రూ.1,36,700
ముంబై: రూ.1,46,890, రూ.1,34,650
న్యూఢిల్లీ: రూ.1,47,040, రూ.1,34,800
కోల్‌కతా: రూ.1,46,890, రూ.1,34,650
విజయవాడ: రూ.1,46,890, రూ.1,34,650
విశాఖ: రూ.1,46,890, రూ.1,34,650
హైదరాబాద్: రూ.1,46,890, రూ.1,34,650
కేరళం: రూ.1,46,890, రూ.1,34,650
వెండి ధర (కిలోకు)..
కోల్‌కతా: రూ.2,50,000
హైదరాబాద్: రూ.2,60,000
చెన్నై: రూ.2,60,000
ముంబై: రూ.2,50,000
ఢిల్లీ: రూ.2,50,000
ఈ వార్తలు కూడా చదవండి
బైబ్యాక్‌లో మూలధన లాభాలపై 12 శాతం సర్‌చార్జి
ఇళ్లు, ఆలయాల్లో 50,000 టన్నుల పసిడి