ఇళ్లు, ఆలయాల్లో 50,000 టన్నుల పసిడి
ABN , Publish Date - Mar 26 , 2026 | 05:36 AM
మన దేశంలోని ఇళ్లు, ఆలయాల్లో వేల టన్నుల బంగారం మూ లుగుతోంది. ప్రస్తుతం ఇది ఎంత లేదన్నా 50,000 టన్నుల వరకు ఉంటుందని కేంద్ర మాజీమంత్రి పీపీ చౌదరి వెల్లడించారు....
విలువ రూ.940 లక్షల కోట్లు
ఆర్థికాభివృద్ధికి తోడ్పడని బంగారం
ఈజీఆర్‌ల ద్వారా సద్వినియోగం
న్యూఢిల్లీ: మన దేశంలోని ఇళ్లు, ఆలయాల్లో వేల టన్నుల బంగారం మూ లుగుతోంది. ప్రస్తుతం ఇది ఎంత లేదన్నా 50,000 టన్నుల వరకు ఉంటుందని కేంద్ర మాజీమంత్రి పీపీ చౌదరి వెల్లడించారు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం దీని విలువ ఎంత లేదన్నా దాదాపు 10 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.940 లక్షల కోట్లు) వరకు ఉంటుందని అసోచాం నిర్వహించిన ఒక సదస్సులో చెప్పారు. ఇళ్లు, ఆలయాల్లో ఇంత పెద్ద మొత్తంలో బంగారం మూలుగుతున్నా, దాన్ని మన ఆర్థిక అభివృద్ధికి సరిగా ఉపయోగించుకోలేకపోవడంపై చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బంగారాన్ని ఆర్థికంగా సరిగా ఉపయోగించుకోగలిగితే పసిడి దిగుమతులు తగ్గడంతో పాటు, మూలధన ఖాతా లోటు (సీఏడీ) కూడా తగ్గుతుందన్నారు. రత్నాభరణాలు ఇప్పటికే మన వస్తు ఎగుమతుల్లో 15ు వాటాతో దాదాపు 50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న విషయాన్ని చౌదరి గుర్తు చేశారు.
తక్షణ అవసరం: గత రెండేళ్లలో బంగారం ధర ఏటా సగటున 30ు చొప్పున పెరిగింది. అయినా దేశంలో పసిడి, నగలకు డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. కొని పెట్టుకుంటే పసిడి ధర ముందు ముందు మరింత పెరగుతుందనే నమ్మకంతో జనం ఎడాపెడా పసిడి కొనేస్తున్నారు. ఇలా కొన్న పసిడి, నగలను భద్రంగా బీరువాల్లో పెట్టుకుని మురిసిపోతున్నారు. దీని వల్ల ప్రజల ఆస్తుల విలువ పెరిగినా, దేశ ఆర్థిక వ్యవస్థపై మాత్రం పెద్ద మొత్తంలో దిగుమతుల భారం పడుతోంది. ఫిజికల్ గోల్డ్‌ను డిమాట్ గోల్డ్‌గా మార్చడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారమని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జితిన్ మక్కర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈజీఆర్‌లే మార్గం
ఫిజికల్ గోల్డ్‌ను ఎలకా్ట్రనిక్ గోల్డ్ రిసీట్స్‌గా (ఈజీఆర్) మార్చడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారమని ఇదే సదస్సు లో ప్రసంగించిన ఎన్‌ఎ్‌సఈ చీఫ్ బిజినెస్ డెవల్‌పమెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ అన్నారు. ఇలా చేయడం ద్వారా ఫిజికల్ గోల్డ్‌ను అప్పగించి ఈజీఆర్‌లు తీసుకున్న వ్యక్తులు, వాటిని ఎన్‌ఎ్‌సఈలో షేర్లలా అమ్మటం, కొనడం చేయవచ్చన్నారు. అయితే ఫిజికల్ గోల్డ్‌ను ఈజీఆర్‌లో మార్చేటపుడు మూడు శాతం జీఎ్‌సటీగా చెల్లించాల్సి రావడంతో ప్రజలు, ఆలయాలు పెద్దగా ముందుకు రావడం లేదన్నారు. దీనిపై ఎన్‌ఎ్‌సఈ ఇప్పటికే ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన సమర్పించిందన్నారు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు సూపర్ స్యూస్!
ధురంధర్-2 డైలాగ్‌తో బుమ్రాకు భార్య సంజన పంచ్.. పోస్ట్ వైరల్