ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. నటుడు, దర్శకుడు కన్నుమూత
ABN , Publish Date - Mar 26 , 2026 | 11:02 AM
సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ‘సూపర్ మ్యాన్’ ఫేమ్ వాలెరీ పెర్రీస్, రాజస్థాన్ యువ నటి హర్షిల్ కాలియా కన్నుమూసిన విషయం మరవక ముందే మలయాళ ప్రముఖ నటుడు, దర్శకుడు ఇ.ఏ.రాజేంద్రన్ కన్నుమూశారు.
ఇంటర్నెట్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ‘సూపర్ మ్యాన్’ ఫేమ్ వాలెరీ పెర్రీస్, రాజస్థాన్ యువ నటి హర్షిల్ కాలియా కన్నుమూసిన విషయం మరవక ముందే మలయాళ ప్రముఖ నటుడు, దర్శకుడు ఇ.ఏ.రాజేంద్రన్ (71) గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, కేరళలోని కొల్లంలో ఉన్న తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. రేపు(శుక్రవారం) త్రిసూర్‌లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇ.ఏ. రాజేంద్రన్ మలయాళ నాటక రంగంలో ఒక దిగ్గజం. అనేక చిత్రాలు, టెలివిజన్ సీరియల్స్‌లో కీలక పాత్రల్లో నటించారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా(NSD) గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. రాజేంద్రన్ సుమారు 60కి పైగా మలయాళ చిత్రాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా నరసింహం, మీశమాధవన్, కలియాట్టం వంటి సూపర్ హిల్ చిత్రాల్లో విలన్, క్యారెక్టర్ పాత్రలో నటించి మెప్పించారు. మాలీవుడ్‌లో ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే ముఖేశ్‌కు స్వయానా బావ. రాజేంద్రన్ భార్య సంధ్య, కుమారుడు దివ్యదర్శన్ కూడా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఆయన మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
సీఎం రేవంత్ కేరళ పర్యటన రద్దు
ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్!