Share News

అల్పపీడన ప్రభావం.. తెలంగాణలో భారీ వర్షాలు

ABN , Publish Date - Sep 13 , 2026 | 09:21 AM

ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాలపై అల్పపీడన ప్రభావం ఏర్పడిందని.. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు.

అల్పపీడన ప్రభావం.. తెలంగాణలో భారీ వర్షాలు
Telangana Rain Alert

హైదరాబాద్, సెప్టెంబర్ 13 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాలపై అల్పపీడన ప్రభావం ఏర్పడిందని.. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసినట్లు చెప్పుకొచ్చారు. మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్‌, యాదాద్రి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసినట్లు తెలిపారు. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశామని అన్నారు.


ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో వర్షం పడుతోంది. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రంలో భారీ వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి ఎడతెరపిలేని వాన పడుతోంది.


మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా విస్తారంగ వర్షాలు

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా విస్తారంగ వర్షాలు కురుస్తున్నాయి. వానలతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఈక్రమంలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచింది.


ఈ వార్తలు కూడా చదవండి..

నిమ్స్‌లో అరుదైన ఘనత.. వైద్యులను అభినందించిన సీఎం రేవంత్‌రెడ్డి

కేసీఆర్ హయాంలోని భూ అక్రమాలను అసెంబ్లీ ముందు ఉంచుతాం: పొంగులేటి

కేసీఆర్.. మాక్ అసెంబ్లీ‌కి కూడా రాలేదంటే చట్టసభలపై నమ్మకం లేదా.?: మంత్రి సీతక్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 13 , 2026 | 09:51 AM