బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి
ABN , Publish Date - Nov 25 , 2026 | 12:37 PM
పశ్చిమ బంగాళాఖాతం నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు అల్పపీడన ద్రోణి నెలకొంది. దీని ప్రభావంతో తమిళనాడు రాష్ట్రంలో ఉత్తరాది జిల్లాల్లో గత మూడు రోజులుగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి.
దక్షిణ జిల్లాలకు భారీ వర్షసూచన
చెన్నై: పశ్చిమ బంగాళాఖాతం నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు అల్పపీడన ద్రోణి నెలకొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఉత్తరాది జిల్లాల్లో గత మూడు రోజులుగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. ఇదిలా ఉండగా, కొత్తగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా కడలూరు, తంజావూరు, మైలాడుదురై, నాగపట్టినం తదితర 29 జిల్లాల్లో బుధవారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఈసారి రాష్ట్రంలో అంతగా లేదని, అక్టోబరులో 17 సె.మీ, నవంబరులో 18 సె.మీ. చొప్పున కురవాల్సిన వర్షం వాతావరణంలో మార్పుల వల్ల అంతంత మాత్రంగానే కురిసిందని తెలిపారు.
తిరుముల్లైవాయల్‌లో మునిగిన ఇళ్లు
సోమవారం రాత్రి కురిసిన వర్షానికి పళ్లిక్కరణై, ఈంజంబాక్కం, షోళింగనల్లూరు, అంబత్తూరు, తిరుముల్లైవాయల్ తదితర ప్రాంతాల్లో నివశిస్తున్న ప్రజలు తల్లడిల్లిపోయారు. తిరుముల్లైవాయల్ పరిధిలోని వివేకానంద వీధి, విజయ్ వీధిల్లో డ్రైనేజీ లేక ఇళ్ల ముందు వర్షపునీరు నిలిచిపోయింది. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు మునగడంతో ప్రజలు ఇబ్బందులెదుర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు తమ సమస్యలపై దృష్టిసారించి డ్రైనేజీ సదుపాయం కల్పించాలని, నివాస ప్రాంతాల్లో చేరిన నీటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఇదిలా వుండగా మంగళవారం మధ్యాహ్నం నగరంలోని పలు ప్రాంతాల్లో హఠాత్తుగా కురిసిన వర్షంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కీలక పరిణామం.. దలై లామాకు కేంద్ర ప్రభుత్వ భవనం కేటాయింపు
యూపీలో కొత్తగా మూడు కోట్ల ఓటర్లను చేర్చేందుకు బీజేపీ ప్లాన్: అఖిలేశ్ యాదవ్
Read Latest AP News And Telangana News And International News And Telugu News