Share News

‘సందేహ’ జాబితాలో సౌరవ్‌దాస్‌ పాస్‌పోర్టు

ABN , Publish Date - Nov 25 , 2026 | 03:34 AM

సీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి సౌరవ్‌దాస్‌ను బ్రిటన్‌కు వెళ్లకుండా ఢిల్లీ విమానాశ్రయ అధికారులు అడ్డుకున్నారు. విమానం ఎక్కేందుకు..

‘సందేహ’ జాబితాలో సౌరవ్‌దాస్‌ పాస్‌పోర్టు

న్యూఢిల్లీ, నవంబరు 24: సీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి సౌరవ్‌దాస్‌ను బ్రిటన్‌కు వెళ్లకుండా ఢిల్లీ విమానాశ్రయ అధికారులు అడ్డుకున్నారు. విమానం ఎక్కేందుకు సిద్ధమై..ఇమ్మిగ్రేషన్‌ పాయింట్‌ వద్దకు వచ్చిన ఆయనను నిలిపివేశారు. పాస్‌పోర్టులో పుట్టిన ప్రాంతం(బర్త్‌ ప్లేస్‌) తప్పుగా నమోదైందని, అందుకే అడ్డుకున్నామని తెలిపారు. సదరు పాస్‌పోర్టును ‘సందేహాస్పద జాబితా’లో చేర్చినట్టు వెల్లడించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే తనను అడ్డుకుందని సౌరవ్‌ ఆరోపించారు. బ్రిటన్‌ పర్యటనలో తాను ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌, ఎడిన్‌బరో వంటి విద్యాసంస్థలను సందర్శించి.. సీజేపీ ఉద్యమంపై అక్కడి విద్యార్థి సంఘాలకు వివరించాల్సి ఉందన్నారు. సీజేపీ ఉద్యమం గురించి ఎక్కడా మాట్లాడకుండా అడ్డుకోవడం కోసమే తనను బ్రిటన్‌ వెళ్లనీయడం లేదని ఆరోపించారు. ‘‘నేను నీరవ్‌ మోదీనో, విజయ్‌ మాల్యానో అయి ఉంటే బాగుండేది. బ్యాంకుల నుంచి రూ.వేల కోట్లు దోచుకుని ఉంటే బాగుండేది’’ అని సౌరవ్‌ ఎక్స్‌లో వ్యాఖ్యానించారు.

Updated Date - Nov 25 , 2026 | 03:36 AM