Share News

యూపీలో కొత్తగా మూడు కోట్ల ఓటర్లను చేర్చేందుకు బీజేపీ ప్లాన్‌: అఖిలేశ్‌ యాదవ్‌

ABN , Publish Date - Nov 25 , 2026 | 03:37 AM

ఉత్తర్‌ప్రదేశ్‌లో కొత్తగా మూడు కోట్ల ఓటర్లను చేర్చేందుకు బీజేపీ ప్రణాళిక రచించిందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ ఆరోపించారు.

యూపీలో కొత్తగా మూడు కోట్ల ఓటర్లను చేర్చేందుకు బీజేపీ ప్లాన్‌: అఖిలేశ్‌ యాదవ్‌

లక్‌నవూ, నవంబరు 24 : ఉత్తర్‌ప్రదేశ్‌లో కొత్తగా మూడు కోట్ల ఓటర్లను చేర్చేందుకు బీజేపీ ప్రణాళిక రచించిందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ ఆరోపించారు. ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదని అన్నారు. కొత్తగా చేర్చే ఓటర్ల బ్యాంకు ఖాతాల వివరాలు సేకరిస్తున్నారనే సమాచారం తన వద్ద ఉందని ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఓటర్లను నమోదు చేయడం మాత్రమే చేయాల్సి ఉండగా...వారి బ్యాంకు ఖాతాల వివరాలు ఎందుకు సేకరిస్తున్నారని ప్రశ్నించారు. కొత్తగా ఓటర్లను చేర్చే ప్రక్రియ సీఎం యోగి ఒత్తిడి మేరకే జరుగుతోందని అఖిలేశ్‌ ఆరోపించారు.

Updated Date - Nov 25 , 2026 | 03:38 AM