Share News

14 వరకు వర్షాలు కురిసే అవకాశం

ABN , Publish Date - Apr 08 , 2026 | 11:06 AM

పశ్చిమ బెంగాల్‌ నుంచి మన్నార్‌ జలసంధి వరకు ఒడిశా దాని పరిసర ప్రాంతాలు, తెలంగాణా, రాయలసీమ, తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం నెలకొని ఉంది.

14 వరకు వర్షాలు కురిసే అవకాశం

చెన్నై: పశ్చిమ బెంగాల్‌ నుంచి మన్నార్‌ జలసంధి వరకు ఒడిశా దాని పరిసర ప్రాంతాలు, తెలంగాణా, రాయలసీమ, తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం నెలకొని ఉంది. ఈ ప్రభావంతో, బుధవారం నుంచి ఈ నెల 14వ తేది వరకు పశ్చిమ కనుమల సరిహద్దు జిల్లాల్లోని ఒకటి, రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, డెల్టా జిల్లాలు, కారైక్కాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశముంది. మిగిలిన తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుంది.


nani1.2.jpgబుధ, గురువారాల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా 2-3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముంది. చెన్నైలో రానున్న 48 గంటల్లో ఆకాశం మేఘావృతంగా ఉంటూ, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముంది. అధిక ఉష్ణోగ్రత 35-36 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 26-27 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.


nani1.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బూతు నేతల రోత గోల!

Read Latest Telangana News and National News

Updated Date - Apr 08 , 2026 | 11:08 AM