24/7 ట్యాంకర్ల సరఫరా
ABN , Publish Date - Apr 08 , 2026 | 09:59 AM
వేసవిలో డిమాండ్‌కు అనుగుణంగా నగరంలో 24/7 ట్యాంకర్లను సరఫరా చేయనున్నట్లు వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి ప్రకటించారు.
పగటి వేళలో గృహ, రాత్రి వేళ కమర్షియల్ అవసరాలకు
తాగునీటి సరఫరాపై ఎండీ సమీక్ష
హైదరాబాద్ సిటీ: వేసవిలో డిమాండ్‌కు అనుగుణంగా నగరంలో 24/7 ట్యాంకర్లను సరఫరా చేయనున్నట్లు వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి ప్రకటించారు. ఇక నుంచి రాత్రి సమయాల్లోనూ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. పగటి వేళల్లో గృహ అవసరాలకు, రాత్రి వేళ కమర్షియల్ అవసరాలకు ట్యాంకర్లను డెలివరీ చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
నగరంలో తాగునీటి సరఫరా పరిస్థితులపై మంగళవారం వాటర్‌బోర్డు ఎండీ అశోక్ రెడ్డి సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత డిమాండ్-సప్లయ్ పరిస్థితులను, జలాశయాలలో ఉన్న నీటి నిల్వలు, పంపిణీ వ్యవస్థ తదితర అంశాలపై ట్రాన్స్‌మిషన్, ఆపరేషన్ మెయింటనెన్స్ విభాగాల ఉన్నతాధికారులతో ఎండీ కూలంకశంగా చర్చించారు. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ రాబోయే 60 రోజులు తాగునీరు సరఫరాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.
నీటి సరఫరాలో సమతుల్యత
నిర్ణయించిన దాని కంటే అదనంగా సప్లయ్ అవుతున్న నీటిని తగ్గించాలని, తక్కువగా అందుతున్న ప్రాంతాలను గుర్తించి సమతుల్య పంపిణీకి తక్షణ చర్యలు చేపట్టాలని ఎండీ అశోక్‌రెడ్డి ట్రాన్స్‌మిషన్ అధికారులను ఆదేశించారు. లీకేజీలు, అనధికార కనెక్షన్లు, నీటి వృథాను నియంత్రించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో వాటర్‌బోర్డు ఈడీ సామ్రాట్ అశోక్, డైరెక్టర్, నారాయణ, సీజీఎంలు, రెవెన్యూ, ఐటీ విభాగపు అధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News