Share News

హోర్ముజ్ రీ-ఓపెన్.. రెండు వారాల పాటు అనుమతించనున్న ఇరాన్: వైట్ హౌస్

ABN , Publish Date - Apr 08 , 2026 | 09:32 AM

పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులకు తాత్కాలిక ఉపశమనం లభించింది. అమెరికా- ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రస్తుతం కీలక మలుపు తీసుకుంది. ఇరాన్‌పై దాడులను రెండు వారాల పాటు నిలిపివేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు.

హోర్ముజ్ రీ-ఓపెన్.. రెండు వారాల పాటు అనుమతించనున్న ఇరాన్: వైట్ హౌస్
Strait of Hormuz reopening

పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులకు తాత్కాలిక ఉపశమనం లభించింది. అమెరికా- ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రస్తుతం కీలక మలుపు తీసుకుంది. ఇరాన్‌పై దాడులను రెండు వారాల పాటు నిలిపివేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. ఈ రెండు వారాల్లో ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతాయని తెలిపారు. కాల్పుల విరమణకు ఇరాన్ కూడా అంగీకరించిందని ప్రకటించారు (US Iran war live updates).


రెండు వారాల పాటు హోర్ముజ్ ద్వారా అన్ని దేశాల నౌకలకు మార్గం సుగమం చేస్తామని ఇరాన్ అంగీకరించినట్టు వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది ట్రంప్ సాధించిన అతి పెద్ద విజయం అని పేర్కొంది. ఈ ప్రకటనతో గ్లోబల్ ఆయిల్ మార్కెట్‌లో తాత్కాలిక ఉపశమనం వచ్చింది. పలు దేశాలు ఈ ఒప్పందం పట్ల హర్షం వ్యక్తం చేశాయి. ఇరు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చి ప్రస్తుత సంక్షోభ పరిస్థితులను పరిష్కరించాలని సూచించాయి. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరగబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి (Strait of Hormuz reopening).


ఇరాన్ సూచించిన పది పాయింట్ల అజెండా సానుకూలంగానే ఉందని ట్రంప్ ప్రకటించారు (Trump ceasefire Iran). ఇరాన్‌పై అన్ని ఆర్థిక ఆంక్షలనూ తొలగించాలని, అణు హక్కులను గుర్తించాలని, యుద్ధం వల్ల కలిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని ఇరాన్ కోరుతోంది. ఇవి పరిష్కారం కాకపోతే మళ్లీ యుద్ధం ముదిరే అవకాశం ఉంది. ఈ రెండు వారాల్లోనే శాశ్వత శాంతి చర్చలు సఫలం కావాలని పలు దేశాలు కోరుకుంటున్నాయి.


ఇవి కూడా చదవండి..

మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..


ఇరాన్‌కు మరో రెండు వారాల గడువు.. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..

Updated Date - Apr 08 , 2026 | 09:39 AM