Share News

ఈ ఫొటోలో మీకు ఏం కనబడుతోంది.. అమ్మాయి మొహాన్ని 5 సెకెన్లలో కనిపెట్టండి..

ABN , Publish Date - Apr 08 , 2026 | 09:26 AM

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. పజిల్స్, ఆప్టికల్ ఇల్యూజన్స్ మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.

ఈ ఫొటోలో మీకు ఏం కనబడుతోంది.. అమ్మాయి మొహాన్ని 5 సెకెన్లలో కనిపెట్టండి..
Optical Illusion

ఒక పజిల్‌ను సాల్వ్ చేసినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. పజిల్స్ పరిష్కరించడం మన మెదడుకు ఒక అద్భుతమైన వ్యాయామం. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి. అన్ని వయసుల వారు ఆసక్తిగా వీటిని పరిష్కరించడం వల్ల మానసిక ఉల్లాసం పొందుతారు.


వైరల్ అవుతున్న పై ఫొటో మీ కళ్ల సామర్థ్యాన్ని టెస్ట్‌ చేసే ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్ టెస్ట్. ఆ ఫొటోలో ఒక అందమైన ప్రకృతి దృశ్యం కనబడుతోంది. ఒక అమ్మాయి నది మధ్యలో నిలబడి ఉంది. చెట్లు, బ్రిడ్జ్ కూడా ఆ ఫొటోలో ఉన్నాయి అయితే ఆ ఫొటోలో ఒక అమ్మాయి మొహం కూడా ఉంది. నిశితంగా పరిశీలిస్తేనే ఆ మొహం మీకు కనబడుతుంది. ఆ అమ్మాయి మొహాన్ని కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 10 సెకెన్ల వ్యవధిలో కనిపెడితే మీ పరిశీలనా శక్తికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.


సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది. చాలా తక్కువ మంది మాత్రమే 5 సెకెన్ల వ్యవధిలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయగలిగారు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? కళ్లు కొద్దిగా మూసి చూడండి.. ఆ ఫొటోలో అమ్మాయి మొహం మీకు కనబడుతుంది.

puzzle2.jpg


ఇవి కూడా చదవండి..

మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..


ఇరాన్‌కు మరో రెండు వారాల గడువు.. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..

Updated Date - Apr 08 , 2026 | 09:26 AM