Share News

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి

ABN , Publish Date - Apr 08 , 2026 | 09:06 AM

హైదరాబాద్‌లోని వనస్థలిపురం ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి.. ర్యాష్‌గా కారు డ్రైవింగ్ చేస్తూ బైక్‌ను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు మృతి చెందారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి
Hyderabad Road Accident

హైదరాబాద్, ఏప్రిల్ 08: వనస్థలిపురం ప్రాంతంలో ఇవాళ(బుధవారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి.. కారు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ, నడుచుకుంటూ వెళ్ళిపోతున్న వ్యక్తిని, అలాగే బైక్ పై వెళ్లిన ఇద్దరు యువకులను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో హోండా సిటీ కారు.. సుమారు 100 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లి పల్టీ కొట్టింది.


ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరణించిన వారు శివ, సందీప్ జోహెల్ అనే యువకులుగా పోలీసులు గుర్తించారు. అలానే పాదాచారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మృతిచెందిన యువకులు మహావీర్ ఇంజినీరింగ్ కాలేజ్ లో ఈసీఈ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న తోటి విద్యార్థులు, కాలేజీకి చెందిన వారు రోడ్డుపై ఆందోళన చేపట్టారు.


ప్రమాదానికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు, ప్రమాదం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:

అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న కేటీఆర్

తమిళనాడు ఎన్నికల్లో కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌గా రేవంత్‌

Updated Date - Apr 08 , 2026 | 09:44 AM