Share News

విజయవాడ ఉగ్రవాద కేసులో షాకింగ్ విషయాలు.. 42 మంది అమ్మాయిలను..

ABN , Publish Date - Apr 08 , 2026 | 08:52 AM

విజయవాడ ఉగ్రవాద లింకుల కేసులో హైదరాబాద్‌కు చెందిన సైదా బేగం విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జిహాదీ గ్రూప్స్ కోసం ఇప్పటివరకు 42 మంది యువతులను రిక్రూట్ చేసి, వెపన్ ట్రైనింగ్ కోసం సన్నాహాలు చేసినట్లు తెలుస్తోంది.

విజయవాడ ఉగ్రవాద కేసులో షాకింగ్ విషయాలు.. 42 మంది అమ్మాయిలను..
Vijayawada Terror case

అమరావతి: విజయవాడ ఉగ్రవాద లింకుల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌కు చెందిన సైదా బేగం విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. మహిళలను ఉగ్రవాద దిశగా ఆకర్షించేలా సైదా బేగం యత్నం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 42 మంది యువతులను రిక్రూట్ చేసింది. 'KHAWATEEN' అనే పేరుతో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, జిహాదీ గ్రూప్స్‌లో యువతను ఆకర్షించే విధంగా వీడియోలు షేర్ చేసినట్లు తెలుస్తోంది.


లాడెన్, జకీర్ నాయక్ తదితరుల జిహాదీ వీడియోలను సైదా బేగం వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేసింది. ఇన్‌స్టాలో 40 అకౌంట్లలో జిహాదీ వీడియోలు ఉంచి, మదర్సాల్లో మతపరమైన శిక్షణ తర్వాత వెపన్‌ ట్రైనింగ్‌కు సన్నాహాలు చేసినట్లు విచారణలో తెలుస్తోంది. పోలీసులు వాట్సాప్‌లో భారీగా PDF ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ట్రైనింగ్, రిక్రూట్‌మెంట్‌కు సంబంధించినవిగా గుర్తించారు. ప్రస్తుతం ఉగ్రవాద లింకులపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తద్వారా ఉగ్రవాద నెట్‌వర్క్‌లో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.


Also Read:

అమరావతిపై జగన్‌ వైఖరిని ప్రశ్నించినందుకు మీడియాపై దాడా?

రచ్చ ఆపొద్దు!

For More Latest News

Updated Date - Apr 08 , 2026 | 08:58 AM