Share News

తూర్పుగోదావరి జిల్లాలో అగ్నిప్రమాదం

ABN , Publish Date - Apr 08 , 2026 | 08:26 AM

తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

తూర్పుగోదావరి జిల్లాలో అగ్నిప్రమాదం
Nallajarla Hospital Fire

తూర్పు గోదావరి జిల్లా, ఏప్రిల్ 08: తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఆసుపత్రిలో ఉన్న మెడిసిన్ స్టోర్ రూమ్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వెంటనే సంఘటన స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపు చేశారు.


ఈ ప్రమాదంలో దగ్ధమైన మందుల విలువ సుమారు 15 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ ప్రమాద సమయంలో ఆసుపత్రిలో రోగులు లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. ఇప్పటికే అధికారులు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి, విద్యుత్ శాఖతో కలిసి సమగ్ర దర్యాప్తు చేపట్టారు. రాష్ట్రంలోని ఇతర ఆసుపత్రుల్లో ఈ తరహా ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.


Also Read:

అమరావతిపై జగన్‌ వైఖరిని ప్రశ్నించినందుకు మీడియాపై దాడా?

రచ్చ ఆపొద్దు!

Updated Date - Apr 08 , 2026 | 12:23 PM