Share News

అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న కేటీఆర్

ABN , Publish Date - Apr 08 , 2026 | 08:11 AM

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారం రోజుల అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. నేడు ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలవనున్నారు.

అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న కేటీఆర్
KTR Returns Hyderabad

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారం రోజుల అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. నగరానికి చేరుకున్న ఆయన, నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలవనున్నారు. ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, ఆ రోజునే ప్లీనరీ సమావేశం నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలపై కీలక చర్చలు జరగనున్నట్టు సమాచారం.


ఇదే సమయంలో, మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలసి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు కేటీఆర్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆయన చేరికపై కూడా త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్‌తో జరిగే సమావేశం అనంతరం పార్టీ ప్లీనరీ, జీవన్ రెడ్డి చేరిక వంటి అంశాలపై స్పష్టత రానుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.


Also Read:

తమిళనాడు ఎన్నికల్లో కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌గా రేవంత్‌

ఫ్యూచర్‌ సిటీపై స్టేకు ఎన్జీటీ నిరాకరణ

For More Latest News

Updated Date - Apr 08 , 2026 | 08:39 AM