రెయిన్ అలర్ట్.. ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు
ABN , Publish Date - Jun 14 , 2026 | 04:11 PM
ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు ప్రకటించారు.
అమరావతి, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు ప్రకటించారు. పశ్చిమమధ్య బంగాళాఖాతం నుంచి తమిళనాడు వరకు ద్రోణి ప్రభావం విస్తరించి ఉందని తెలిపారు. సోమవారం పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. మన్యం, అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు వర్ష సూచనలు ఉన్నాయని వివరించారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాలకు వర్ష హెచ్చరికలు జారీ చేశారు. శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వివరించారు. గుంటూరు, బాపట్ల, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
రెడ్ అలర్ట్..
శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు.
ఆరెంజ్ అలర్ట్
అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ఎల్లో అలర్ట్
కాకినాడ, తూర్పుగోదావరి, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ హెచ్చరించారు.
వర్షాలు, పిడుగుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు. ఉరుములు, పిడుగుల సమయంలో చెట్ల కింద నిలబడవద్దని తెలిపారు. భారీ హోర్డింగ్స్ సమీపంలో ఆశ్రయం పొందొద్దని ప్రజలకు సూచించారు. వాగులు, కాలువలు పొంగిపొర్లే అవకాశం ఉందని చెప్పారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.ప్రకాశం బ్యారేజీ నుంచి నీటి విడుదల కొనసాగుతోందన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పశువులను నది పరిసర ప్రాంతాల్లో వదలొద్దని అన్నారు.
పిడుగులు, ఈదురుగాలుల సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని నిర్దేశించారు. తెగిపోయిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో అత్యధికంగా 38 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. గుర్లలో 35.7 మిల్లిమీటర్లు, మడకశిరలో 33 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పారు. లావేరు, సీతంపేట ప్రాంతాల్లో 32 మిల్లిమీటర్ల వర్షపాతం రికార్డు అయిందని తెలిపారు. జి.సిగడాంలో 30.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ప్రఖర్ జైన్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీ అభివృద్ధిని గొడ్డలి పార్టీ అడ్డుకుంటోంది.. కొల్లు రవీంద్ర ధ్వజం
ఎంఎస్ఎంఈ పార్కులతో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News