తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక.. 7 జిల్లాలకు అలర్ట్
ABN , Publish Date - Jun 14 , 2026 | 09:54 PM
తెలంగాణలో రాబోయే రోజుల్లో వర్షాలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు సూచించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో 7 జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేశారు.
హైదరాబాద్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రాబోయే రోజుల్లో వర్షాలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు సూచించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో 7 జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
అలాగే వచ్చే 4 నుంచి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రం అంతటా విస్తరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రుతుపవనాల విస్తరణతో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాల సమయంలో అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడరాదని హెచ్చరించారు. వ్యవసాయ రంగానికి ఈ వర్షాలు ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో నీటి నిల్వలు, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆపరేషన్ సిందూర్ విజయంలో ఎయిర్ వారియర్స్‌ది కీలక పాత్ర: రాజ్‌నాథ్ సింగ్
వీబీజీ రాంజీ స్కీంపై కేంద్రానికి వ్యతిరేకంగా లేఖ రాస్తాం: మంత్రి సీతక్క
‘సర్’ పేరుతో అసలైన ఓట్లను తొలగిస్తే ఊరుకోం.. కేటీఆర్ వార్నింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News