ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
ABN , Publish Date - Jun 10 , 2026 | 02:47 PM
రాబోయే మూడు గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. వర్షాల నేపథ్యంలో విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు.
అమరావతి, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): రాబోయే మూడు గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. వర్షాల నేపథ్యంలో విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ముఖ్యంగా అరకు, గజపతినగరం, విజయనగరం, ఎస్.కోట, కొత్తవలస, చోడవరం, నర్సీపట్నం, మాడుగుల మండలాలు, పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీటిమునిగే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని సూచించారు. ముఖ్యంగా రైతులు, మత్స్యకారులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద, ఓపెన్ ప్రదేశాల్లో నిలబడవద్దని హెచ్చరించారు. స్థానిక అధికారులు, విపత్తుల నిర్వహణ శాఖ సూచనలను ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
2047 స్వర్ణాంధ్ర లక్ష్యాలపై సీఎం ఫోకస్.. డేటా డ్రివెన్ గవర్నెన్స్‌కు ప్రాధాన్యం
లోకేశ్‌పై జగన్ అండ్ కో ఫేక్ ప్రచారాలు చేస్తోంది.. రామ్మోహన్ ధ్వజం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News