Share News

ధవళేశ్వరం వద్ద పెరిగిన గోదావరి ప్రవాహం.. అధికారుల అలర్ట్

ABN , Publish Date - Sep 26 , 2026 | 08:41 AM

ధవళేశ్వరం వద్ద గోదావరికి వరద ప్రవాహం పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్ వెల్లడించారు. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్, అవుట్ ఫ్లో 5 లక్షల క్యూసెక్కులుగా ఉందని తెలిపారు.

ధవళేశ్వరం వద్ద పెరిగిన గోదావరి ప్రవాహం.. అధికారుల అలర్ట్
Godavari Flood Alert

అమరావతి, సెప్టెంబర్ 26 (ఆంధ్రజ్యోతి): ధవళేశ్వరం వద్ద గోదావరికి వరద ప్రవాహం పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్ వెల్లడించారు. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్, అవుట్ ఫ్లో 5 లక్షల క్యూసెక్కులుగా ఉందని తెలిపారు. ఈరోజు (శనివారం) రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.


గోదావరి వరద పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ప్రఖర్‌ జైన్ అన్నారు. గోదావరి ప్రభావిత పోలవరం, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని తెలిపారు. లంక గ్రామాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నదిలో స్నానం, చేపలు పట్టడంలాంటివి చేయొద్దని అన్నారు. వరద ప్రవహించే రోడ్లపై ప్రయాణం చేయొద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.


సుంకేసుల డ్యామ్‌‌కు జలకళ..

మరోవైపు.. కర్నూలు జిల్లాలోని సుంకేసుల డ్యామ్‌‌కు జలకళ సంతరించుకుంది. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు సుంకేసుల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. ఇన్ ఫ్లో 2500 క్యూసెక్కులుగా ఉంది. ఇవాళ సాయంత్రానికి పూర్తి స్థాయి నీటిమట్టం 1.2 టీఎంసీలకు చేరుకునే అవకాశం ఉంది. మరో ఏడు రోజులపాటు వరద కొనసాగే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు.

విశాఖపట్నం జిల్లాలో 33.7 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు

విశాఖపట్నం జిల్లాలో గడిచిన నాలుగు రోజులుగా కురిసిన వర్షాలతో 33.7 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.

Updated Date - Sep 26 , 2026 | 10:06 AM