Share News

ఎల్‌నినో దెబ్బతో అరకొర వానలు

ABN , Publish Date - Jul 25 , 2026 | 12:12 PM

వరంగల్‌ జిల్లాలో ఈ సంవత్సరం ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాభావం ఏర్పడింది.

ఎల్‌నినో దెబ్బతో అరకొర వానలు
Warangal, Rains, IMD

  • నర్సంపేట, పర్వతగిరిలో 60-69శాతం లోటు వర్షపాతం

వరంగల్‌: వరంగల్‌ జిల్లాలో ఈ సంవత్సరం ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాభావం ఏర్పడింది. జిల్లాలో ఇప్పటివరకు సగటు సాధారణ వర్షపాతం 359.2 మిల్లీమీటర్లు పడాల్సి ఉండగా కేవలం 174.8మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైందని, ఇది 51శాతం లోటు అని వాతావరణశాఖ తెలిపింది. నర్సంపేట, పర్వగతగిరి మండాలల్లో అత్యధిక వర్షాభావం నమోదైనట్లు తెలిపింది.


సాధారణ వర్షపాతంతో పోలిస్తే నర్సంపేటలో 413.9 మిల్లీమీటర్లకు గాను కేవలం 188.1 మి.మీ. పడి (69శాతంలోటు), పర్వరతగిరి మండలంలో 328.2మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి కేవలం 131.7మిల్లీమీటర్ల (60శాతం లోటు) వర్షపాతం నమోదైంది. వర్దన్నపేట 263.9 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి దగ్గరగా 181.2 మి.మీ. (31శాతం లోటు) వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది.


hnk1.2.jpgప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి..మిగిలిన 11 మండలాల్లో ఖానాపురం మండలంలో 59 శాతం, ఖిలావరంగల్‌ మండలంలో 57శాతం, నెక్కొండ మండలంలో 56వాతం, వరంగల్‌ మండలం లో 53శాతం, నల్లబెల్లి మండలంలో 52శాతం, సంగెం మండలంలో 49శాతం, గీసుకొండ మండలంలో 47శాతం, దుగ్గొండి మండలంలో 44శాతం, చెన్నరావుపేట మండలంలో 41శాతం, రాయపర్తి మండలంలో 39శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి:

సంతానం కోసం ఆరాటం

కమర్షియల్‌ ఆదాయంపై దక్షిణ డిస్కం దృష్టి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 25 , 2026 | 12:12 PM