Share News

కమర్షియల్‌ ఆదాయంపై దక్షిణ డిస్కం దృష్టి

ABN , Publish Date - Jul 25 , 2026 | 11:33 AM

కమర్షియల్‌ ఆదాయంపై దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది.

కమర్షియల్‌ ఆదాయంపై దక్షిణ డిస్కం దృష్టి
TGSPDCL commercial consumers

  • బిల్లుల బకాయిలు లేకుండా చర్యలు

హైదరాబాద్‌ సిటీ: కమర్షియల్‌ ఆదాయంపై దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. నష్టాలు తగ్గించడంతోపాటు బిల్లుల బకాయిలు లేకుండా చూడాలని టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ జితేష్‌ వి పాటిల్‌ ఆదేశాల మేరకు కమర్షియల్‌ కనెక్షన్లు, వాటి డిమాండ్‌ను సెక్షన్ల వారీగా పరిశీలిస్తున్నారు. క్యూర్‌ పరిధిలో 10 సర్కిళ్లలో 9.78 లక్షల కమర్షియల్‌ కనెక్షన్లు ఉన్నాయి. అత్యధికంగా హైదరాబాద్‌ సౌత్‌ సర్కిల్‌లో 1.44 లక్షలు, అతి తక్కువగా బంజారాహిల్స్‌ సర్కిల్‌లో 72 వేలు ఉన్నాయి. సౌత్‌ సర్కిల్‌లో మాత్రం బిల్లులు వసూలు కావడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టారు.


పలు సర్కిళ్ల పరిధిలో కొంతమంది డొమెస్టిక్‌ కేటగిరీలో విద్యుత్‌ కనెక్షన్లు తీసుకొని వాటిని కమర్షియల్‌ అవసరాలకు వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉండడంతో వాటిని గుర్తించేందుకు విజిలెన్స్‌ అధికారులతో తనిఖీలు చేపట్టాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కమర్షియల్‌ విద్యుత్‌ వినియోగం అధికంగా ఉన్న ప్రాంతాల్లో డిస్ర్టిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్ల వారీగా ఎనర్జీ ఆడిట్‌ చేపట్టే దిశగా దక్షిణ డిస్కం చర్యలు చేపడుతోంది. వ్యాపార కేంద్రాల్లో వినియోగించే ప్రతీ యూనిట్‌ పక్కాగా బిల్లింగ్‌ అయ్యేలా చూడనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

సంతానం కోసం ఆరాటం

లాభం ఆశ చూపి.. రూ.16.35 లక్షలు కొట్టేశారు!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 25 , 2026 | 11:33 AM