Share News

వాయుగుండం వచ్చినా.. భారీ వర్షాల్లేవు..

ABN , Publish Date - Jul 28 , 2026 | 07:38 AM

తీవ్ర వాయుగుండం వచ్చినా.. రాష్ట్రంలో ఆశించిన వర్షాలు కురవలేదు. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

వాయుగుండం వచ్చినా.. భారీ వర్షాల్లేవు..
Rains, IMD, Andhrapradesh

  • చెదురుమదురు చినుకులతో సరి

  • దిశగా మార్చుకుని బెంగాల్‌ వైపు వాయుగుండం

  • రాష్ట్రంలో 54 శాతం లోటు వర్షపాతం

  • ఎల్‌నినోతో బలహీనంగానే నైరుతి రుతుపవనాలు

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి): తీవ్ర వాయుగుండం వచ్చినా.. రాష్ట్రంలో ఆశించిన వర్షాలు కురవలేదు. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే విచిత్రంగా బంగాళాఖాతంలో పశ్చిమ వాయవ్యంగా పయనించాల్సిన.. తీవ్ర వాయుగుండం దిశ మార్చుకుని ఉత్తరంగా పయనించడంతో సోమవారం కోస్తాలో చెదురుమదురు వర్షాలే పడ్డాయి. ఈ సీజన్‌లో సోమవారం వరకు రాష్ట్రంలో వర్షపాతం లోటు 54 శాతానికి చేరుకోవడంతో కరువు ఛాయలు కనిపిస్తున్నాయని వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. కాగా ఎల్‌నినో సంవత్సరాల్లో నైరుతి రుతుపవనాలు బలహీనంగా మారతాయని, అరేబియా సముద్రం నుంచి వీచే గాలులు బలంగా ఉండవని, పశ్చిమ కనుమల వరకు పరిమితమై ఆ తరువాత పొడిగా మారతాయని విశ్లేషించారు. ప్రస్తుత సీజన్‌లో తెలంగాణ, ఏపీ, తమిళనాడు రెయిన్‌షాడో ప్రాంతాలుగా మారతాయన్నారు. రాష్ట్రంలో చాలాచోట్ల మేఘాలున్నా అవి బలంగా లేకపోవడంతో వర్షాలు కురవడం లేదన్నారు.


ఓడరేవుల్లో మూడో నంబరు భద్రతా సూచిక

ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ను ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారానికి వాయుగుండంగా, సోమవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది ఉత్తరంగా పయనించి ఒడిశాలోని బాలసోర్‌కు తూర్పున 80కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తరంగా పయనిస్తూ మంగళవారం ఉదయానికి హల్దియ, దిగలకు సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తరువాత ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ వైపు పయనిస్తోంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున బుధవారం వరకు ఉత్తర కోస్తాలోని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ కేంద్రం పేర్కొంది. కోసాంధ్రలోని కళింగపట్నం నుంచి కాకినాడ వరకు ఓడరేవుల్లో మూడో నంబరు, మిగిలినచోట్ల ఒకటో నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు.


నేడు కోస్తాలో మోస్తరు వర్షాలు

అమరావతి: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో మంగళవారం కోస్తాంధ్రలో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. దక్షిణ కోస్తాలో వేడి వాతావరణం కొనసాగింది. కావలిలో 38.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వాయుగుండం నేపథ్యంలో వాతావరణం అనుకూలంగా లేనందున బుధవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పొగాకు రైతులకు శుభవార్త..!

కళాకారుల కష్టాలు తీర్చేలా..!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 28 , 2026 | 07:38 AM