అప్పుడే కాసుల వేట!
ABN , Publish Date - Jul 28 , 2026 | 06:46 AM
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఆ తర్వాత 17 నుంచి పూర్తిస్థాయిలో విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి.
ఎయిర్‌పోర్టు నిర్వహణ విభాగాల ఏజెన్సీల కోసం పోటీ
కాంట్రాక్టులు దక్కించుకునేందుకు మాజీ మంత్రి, ఓ మహిళా ఎమ్మెల్యే తీవ్ర ప్రయత్నాలు
సీఎం, డిప్యూటీ సీఎం ఆదేశాలకు విరుద్ధంగా నేతల తీరు
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఆ తర్వాత 17 నుంచి పూర్తిస్థాయిలో విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఈక్రమంలో విమానాశ్ర య నిర్వహణకు సంబంధించి గ్రౌండ్ స్టాఫ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, కార్గో హ్యాండ్లింగ్ లోడర్లు తదితర విభాగాల ఏజెన్సీల కాంట్రాక్టులు దక్కించుకునేందుకు అధికార పక్షంలో పోటీ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. టీడీపీకి చెందిన ఒక మాజీ మంత్రి, ఆయన తనయుడు, ఓ మహిళా ఎమ్మెల్యే రంగంలోకి దిగారు. ఈ మేరకు నిర్మాణ సంస్థపై ఒత్తిడి తీసుకురావడంతో పాటు ఢిల్లీ స్థాయి లాబీయింగ్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచా రం. ఓవైపు ప్రభుత్వ ప్రాజెక్టులు, మద్యం, ఇసుక వంటి విషయాల్లో పార్టీ నేతల ప్రమేయం వద్దని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యా ణ్ ఆదేశిస్తుంటే.. మరోవైపు అందుకు విరుద్ధంగా పలువురు నేతల తీరు ఉండడం కూటమిలో హాట్ టాపిక్‌గా మారింది.
కుమారుడి కోసం పావులు!
నిర్వహణ ఏజెన్సీలను దక్కించుకునేందుకు టీడీపీకి చెందిన ఆ మాజీ మంత్రి, ఆయన తనయుడు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో గెలిచిన ఈ నాయకుడు మంత్రి పదవి ఆశించారు. కానీ దక్కలేదు. అయితే విమానాశ్రయానికి దగ్గర నియోజకవర్గం కావడంతో ఎలాగైనా ఏజెన్సీలను దక్కించుకోవాలన్న పట్టుదలతో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. నిర్మాణ సంస్థపై ఈ మేరకు ఒత్తిడి తెస్తున్న ట్లు కూడా సమాచారం. దీనిపై ఒకసారి ఢిల్లీకి కూడా వెళ్లి వచ్చినట్లు తెలిసింది. మరోవైపు ఓ మహిళా ఎమ్మెల్యే తన సొంత సాఫ్ట్‌వేర్ కంపెనీలో నైపుణ్యం ఉన్న సిబ్బందితో పాటు, వైమానిక రంగంలో అనుభవం ఉన్న సిబ్బందిని తీసుకొస్తామని.. ఏజెన్సీల కాంట్రాక్టులు తమకు ఇవ్వాలని అడ గ్గా.. ఎయిర్‌పోర్టు నిర్మాణ సంస్థ ఆమె ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. అవసరమైతే తగిన పరీక్షలు నిర్వహించి, అర్హత ఉంటే స్థానికత ప్రామాణికంగా ఉపాధి కల్పిస్తామని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే దీని తర్వాత కూడా సదరు ఎమ్మె ల్యే ఉన్నత స్థాయిలో తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది.
ఏజెన్సీలకు ఏటా రూ.కోట్ల చెల్లింపులు
దేశంలోని పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఒకటిగా నిలవనున్న భోగాపురం ఎయిర్‌పోర్టులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా ఉండనున్నాయి. పౌర విమానయాన శాఖకు సంబంధించి ఉద్యోగాలు ఎలానూ ఉంటాయి. మరోవైపు అంతకుమించి ప్రైవేటు ఉద్యోగాలు కూడా లభిస్తా యి. వివిధ విభాగాలకు సంబంధించి మూడు షిఫ్టులకుగానూ దాదాపు 25 వేల ప్రైవేటు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.
ప్రధానంగా గ్రౌండ్ స్టాఫ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, కార్గో హ్యాండ్లింగ్ లోడర్లు, యుటిలిటీ వర్కర్లు, సామగ్రి మోసేవారు, ట్యాక్సీ డ్రైవర్లు, పారిశుధ్య విభాగానికి సంబంధించి స్వీపర్లు ఉంటారు. వివిధ విభాగాల ఏజెన్సీలను ఏర్పాటు చేసి.. వారికి కాంట్రాక్ట్ ఇస్తారు. విమాన ప్రయాణికుల టికెట్లు, కార్గో రవాణా ద్వారా వచ్చే కొంత మొత్తాన్ని విమానాశ్రయ నిర్వహణకు వినియోగిస్తారు. ఏటా ఈ ఏజెన్సీలకు కోట్లాది రూపాయల చెల్లింపులు ఉంటాయి. ఈ ఏజెన్సీలు థర్డ్ పార్టీలుగా ఉంటాయి. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగులను, కార్మికులను నియమించి పనులు చేస్తుంటాయి. అందుకే ఈ ఏజెన్సీలను దక్కించుకునేందుకు విపరీతమైన పోటీ ఉంటోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News