ప్రతి ఎకరాకు సాగునీరు
ABN , Publish Date - Jul 28 , 2026 | 05:29 AM
రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించ డం, గ్రామాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూ పడమే సీఎం చంద్రబాబు ధ్యే యమని ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు.
అదే సీఎం ధ్యేయం
కుప్పంలో నారా భువనేశ్వరి
రామకుప్పం, జూలై 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించ డం, గ్రామాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూ పడమే సీఎం చంద్రబాబు ధ్యే యమని ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటనకు వచ్చిన ఆమె.. సోమవారం రామకుప్పం మండలంలో పర్యటించారు. ననియాల, పీఎంకే తండా, పంద్యాలమడుగు గ్రామాల మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. హంద్రీ-నీవా ప్రాజెక్టుతో కుప్పం సహా సీమలో సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నారన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం ఉండదని ప్రచారం చేసినా ప్రస్తుతం దానివల్ల ఒనగూరుతున్న ప్రయోజనాన్ని ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా ఉందన్నారు. యువతకు ఉపాధి లక్ష్యంతో పర్యాటకాభివృద్ధికి సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. సీఎంగా చంద్రబాబు బిజీగా ఉండటంతో తాను కుప్పం నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తూ ప్రజల బాగోగులు తెలుసుకుంటున్నానని భువనేశ్వరి తెలిపారు.