రెండు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ!
ABN , Publish Date - Jul 28 , 2026 | 05:45 AM
శాసనమండలిలో రెండు గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. డిప్యూటీ చైర్‌పర్సన్ జకియా ఖానం, వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు పదవీకాలం సోమవారంతో ముగిసింది.
ముగిసిన జకియా ఖానం, రవీంద్రబాబు పదవీకాలం
అమరావతి, జూలై 27(ఆంధ్రజ్యోతి): శాసనమండలిలో రెండు గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. డిప్యూటీ చైర్‌పర్సన్ జకియా ఖానం, వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు పదవీకాలం సోమవారంతో ముగిసింది. ఈ స్థానాలకు కొత్త అభ్యర్థులను టీడీపీ నుంచే నామినేట్ చేయనున్నారు. దీంతో ఆ పార్టీ నేతలు పెద్దసంఖ్యలోనే పోటీపడుతున్నారు. అయితే ప్రధాని మోదీ భోగాపురం విమానాశ్రయం ప్రారం భోత్సవానికి రానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ముగిసే వరకు ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై సీఎం చంద్రబాబు దృష్టి సారించే అవకాశం లేదు.