Share News

తుపానుగా మారిన వాయుగుండం.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ వెల్లడి

ABN , Publish Date - Nov 16 , 2026 | 08:51 PM

బంగాళాఖాతంతో కొనసాగుతున్న వాయుగుండం బలపడి ‘అక్వాన్’ తుపానుగా మారిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.

తుపానుగా మారిన వాయుగుండం.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ వెల్లడి
andhra pradesh aquaon cyclone

అమరావతి, నవంబర్ 16: బంగాళాఖాతంతో కొనసాగుతున్న వాయుగుండం బలపడి ‘అక్వాన్’ తుపానుగా మారిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. అక్వాన్ ప్రభావంతో రాష్ట్రంతో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపారు.


బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం బలపడి తుపానుగా మారిందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. తుపాను ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఏలూరు, కాకినాడ, ఉభయగోదావరి, కోనసీమ, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. విజయనగరం, విశాఖ, అనకాపల్లి, గుంటూరు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఎండీ తెలిపారు.


ఈ తుపాను శుక్రవారం మధ్యాహ్నానికి తీవ్ర తుపానుగా మారి.. నెల్లూరు- తుని ప్రాంతాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. తీరం దాటే సమయంలో గంటకు 120-130 కి.మీ వేగంతో.. గరిష్ఠంగా 145 కి.మీ వేగంతో బలమైన పెనుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ముఖ్యంగా మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

కాగా.. అక్వాన్ తుపాను గురించిన పుకార్లను నమ్మవద్దని ఎండీ ప్రఖర్ జైన్ ప్రజలకు సూచించారు. అత్యవసర సహాయం కోసం ‘మన మిత్ర’ సహాయక కేంద్రానికి ఫోన్ చేయాలని కోరారు. టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 లను సంప్రదించాలని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్థానిక ఎన్నికల్లో ఓటమిని అంగీకరించలేకనే మాపై జగన్ అండ్ కో అసత్య ఆరోపణలు: మంత్రి జనార్దన్ రెడ్డి

వాయుగుండం ప్రభావం.. ఏపీకి భారీ వర్ష సూచన

అంతర్జాతీయ వేదికపై ఏపీ ఖ్యాతిని జ్యోతి యర్రాజీ చాటారు: పల్లా శ్రీనివాసరావు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 08:51 PM