అలర్ట్.. రానున్న మూడు గంటల్లో ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు
ABN , Publish Date - Aug 03 , 2026 | 04:47 PM
రానున్న మూడు గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో పిడుగుపాటుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
అమరావతి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): రానున్న మూడు గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో పిడుగుపాటుతో కూడిన వర్షాలు (AP Rain Alert) పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే విజయనగరం, విశాఖపట్నం, అల్లూరిసీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆరెంజ్ అలర్ట్ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు పడతాయని వెల్లడించారు.
అరకు, చింతపల్లె, నర్సీపట్నంలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. యలమంచిలి, అనకాపల్లి, విశాఖపట్నం పరిసరాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. శ్రీకాకుళం, మన్యం, కాకినాడకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు చేశారు.
ఏలూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వెల్లడించారు. ఎల్లో అలర్ట్ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన వానలు కురుస్తాయని తెలిపారు. ఉరుములు, పిడుగులు పడే సమయంలో ప్రజలు చెట్ల కింద నిలబడవద్దని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు విజ్ఞప్తి చేశారు.
వార్తలు కూడా చదవండి...
కేంద్ర పన్నుల వాటాతో ఏపీ అభివృద్ధి మరింత వేగవంతం: సీఎం చంద్రబాబు
డ్రగ్స్ రహిత ఏపీ కోసం కృషి చేస్తున్నాం: మంత్రి నారా లోకేశ్
పొగాకు రైతులకు భారీ సహాయ ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News