తిరుపతిలో ఏనుగు బీభత్సం.. మావటికి తీవ్ర గాయాలు

ABN, Publish Date - Oct 04 , 2026 | 07:11 PM

తిరుపతి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద ఒక్కసారిగా ఏనుగు బీభత్సం సృష్టించింది. వాహన మండపం సమీపంలో ఊంజల సేవ సమయంలో మావటి చంద్రయ్యపై ఏనుగు దాడి చేసింది.

ఇంటర్నెట్ డెస్క్, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): తిరుపతి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద ఒక్కసారిగా ఏనుగు బీభత్సం సృష్టించింది. వాహన మండపం సమీపంలో ఊంజల సేవ సమయంలో మావటి చంద్రయ్యపై ఏనుగు దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మావటిని వెంటనే తిరుపతి స్విమ్స్ (SVIMS) ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. మావటిని టీటీడీ అధికారులు పరామర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫిబ్రవరి 3న అమరావతి నుంచి తొలి క్వాంటమ్ కంప్యూటర్ ఆవిష్కరిస్తాం: సీఎం చంద్రబాబు

ఆసియా గేమ్స్‌లో భారత్‌కు 19వ స్వర్ణం.. పవన్, లోకేశ్ అభినందనలు

బీసీలకు వైసీపీ అన్యాయం చేసింది.. రామ్మోహన్ ధ్వజం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated at - Oct 04 , 2026 | 08:23 PM