రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ హవా.. 70 శాతానికి పైగా స్థానాల్లో విజయం

ABN, Publish Date - Nov 24 , 2026 | 01:37 PM

రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సాధారణంగా స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీల హవా కొనసాగుతుండగా, రాజస్థాన్‌లో అందుకు భిన్నంగా ప్రతిపక్ష కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేసింది.

స్థానికసంస్థల ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీ గెలవడం సర్వసాధారణం. కానీ రాజస్థాన్‌లో అందుకు భిన్నంగా జరిగింది. ప్రతిపక్ష కాంగ్రెస్ ఏకంగా 70 శాతానికి పైగా స్థానాల్లో గెలుపొందింది. కాగా.. ఉత్తరప్రదేశ్‌లో రానున్న 3 నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ రాజస్థాన్ ఎన్నికల ప్రభావం పొరుగు రాష్ట్రంపై పడుతుందేమో అన్న భయం బీజేపీని వెంటాడుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి...

పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!

Updated at - Nov 24 , 2026 | 01:37 PM