సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్లతో దద్దరిల్లిన ఢిల్లీ
ABN, Publish Date - Oct 06 , 2026 | 02:25 PM
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా కూటమి నేతలు ఆందోళనకు దిగారు. వారి నినాదాలతో ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా కూటమి నేతలు ఆందోళనకు దిగారు. వారి నినాదాలతో ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మంగళవారం ఉదయం ఇండియా కూటమి (INDIA bloc) నేతలు పార్లమెంట్ మకర ద్వారం నుంచి ఎన్నికల సంఘం (EC) కార్యాలయం (నిర్వాచన్ సదన్) దిశగా ర్యాలీ చేపట్టారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ.. సేవ్ డెమోక్రసీ వద్ద బ్యానర్లను ప్రదర్శించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణను అంతర్జాతీయ విద్యా కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యం: సీఎస్ సంజయ్ జాజు
తెలంగాణలో ‘సర్’ పేరుతో 90 లక్షల ఓట్లు తీసేశారు: మహేశ్ గౌడ్
రామప్పను కాపాడేందుకు పెద్దఎత్తున ఉద్యమిస్తాం: కేటీఆర్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News
Updated at - Oct 06 , 2026 | 03:16 PM