కొడుకు పెళ్లి సంబరాల్లో సింగర్‌గా మారిన జగ్గారెడ్డి
ABN, Publish Date - Nov 25 , 2026 | 06:13 PM
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తనలోని మరో కళను బయటపెట్టారు. నిత్యం రాజకీయ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలతో బిజీగా ఉండే ఆయన ఈసారి సింగర్‌గా మారి అందరినీ ఆకట్టుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తనలోని మరో కళను బయటపెట్టారు. నిత్యం రాజకీయ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలతో బిజీగా ఉండే ఆయన ఈసారి సింగర్‌గా మారి అందరినీ ఆకట్టుకున్నారు. సంగారెడ్డిలో జరిగిన తన కుమారుడు భరత్ సాయి రెడ్డి వివాహ వేడుకల్లో జగ్గారెడ్డి పాట పాడుతూ సందడి చేశారు.
కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జరిగిన వివాహ వేడుకల్లో జగ్గారెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన భార్య నిర్మలా జగ్గారెడ్డి ముందు ఆయన ఓ మెలోడీ పాటను ఆలపించారు. రాజకీయ ప్రసంగాలతో ప్రజలను పలకరించే ఆయన, ఈసారి తన గానంతో కుటుంబ సభ్యులను అలరించారు. జగ్గారెడ్డి పాట పాడుతున్న సమయంలో అక్కడున్న బంధుమిత్రులు చప్పట్లతో ప్రోత్సహించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మూసీ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచండి.. అధికారులకు సీఎం ఆదేశం
మహిళలకు సీఎం రేవంత్‌రెడ్డి కానుక.. కోటి ఇందిరమ్మ చీరల పంపిణీకి శ్రీకారం
హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి పాదయాత్ర.. 20 ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News
Updated at - Nov 25 , 2026 | 06:15 PM