Share News

టీవీ.. ఠీవీ.. ఊరూరా విజ్ఞాన వెలుగులు పంచుతున్న టెలివిజన్‌

ABN , Publish Date - Nov 21 , 2026 | 12:35 PM

నాటి టెలివిజన్‌.. నేడు మనిషి అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ స్క్రీన్‌గా మారిపోయింది. అయినా దశాబ్దాల కిందట సమాచార, విజ్ఞాన విప్లవానికి నాంది పలికింది మాత్రం టెలివిజన్‌.

టీవీ.. ఠీవీ.. ఊరూరా విజ్ఞాన వెలుగులు పంచుతున్న టెలివిజన్‌
World Television Day

  • బ్లాక్‌ అండ్‌ వైట్‌ నుంచి డిజిటల్‌ వైపు పరుగులు

  • 1959 సెప్టెంబరు 15న భారత్‌లో ప్రారంభం

  • 1980లో ఎల్‌పీటీ కేంద్రాల ఏర్పాటుతో ఓరుగల్లులో ప్రసారాలు

  • నేడు ‘ప్రపంచ టెలివిజన్‌ దినోత్సవం’

నాటి టెలివిజన్‌.. నేడు మనిషి అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ స్క్రీన్‌గా మారిపోయింది. అయినా దశాబ్దాల కిందట సమాచార, విజ్ఞాన విప్లవానికి నాంది పలికింది మాత్రం టెలివిజన్‌. ఊరి ప్రజలంతా గ్రామ పంచాయతీ కార్యాలయం టీవీ వద్దకు పరుగులు పెడితే.. సంపన్నవర్గాలు ఒక్క చోట కూర్చుని బంతిభోజనం చేస్తూ దూరదర్శన్‌ చూస్తూ సంతోషంగా గడిపిన రోజులు మరుపురాని జ్ఞాపకాలు. ఇక ఆదివారం వచ్చిందంటే చాలు.. టీవీలకు అతుక్కునేవారు. ఇంకా ఆ రోజుల్లో టీవీ చూడటం అంటే ఒక పెద్ద సాహసమే. బడులకు డుమ్మా కొట్టి మరీ పిల్లలు టీవీ ఉన్న ఇళ్ల కిటికీల దగ్గరకు చేరి దొంగ చాటుగా చూసిన సందర్భం ఇప్పటికీ చాలామంది మెదళ్లలో తీపి జ్ఞాపకంగా మిగిలి ఉంది. ఇక ఆదివారం సాయంత్రం ప్రసారమయ్యే ఒక్క తెలుగు పాత సినిమా కోసం ఉదయం నుంచే ఎదురుచూపులు మొదలయ్యేవి. ఇక బుధ, శుక్రవారాల్లో వచ్చే చిత్రలహరి, చిత్రవిహార్‌ పాటల కోసం యువత ఉరకలేసేది. ప్రతీ ఆదివారం ఉదయం ప్రసారమయ్యే రామాయణం, మహాభారతం సీరియళ్లు ప్రసారమయ్యే సమయంలో వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయేవి. నేడు ఇంటర్‌నెట్‌తో ఓటీటీలో కొత్త చిత్రాలు ప్రదర్శింపబడుతున్నా చాలా మంది టెలివిజన్‌లోనే వీక్షించేందుకు పోటీ పడుతుంటారు. ఈ తరుణంలో నవంబరు 21 ‘ప్రపంచ టెలివిజన్‌ దినోత్సవం’ సందర్భంగా నాటి మధుర స్మృతులను మరోసారి గుర్తుచేస్తూ ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..

వరంగల్‌:టెలివిజన్‌ ఆవిష్కరణ వెనుక ఎందరో శాస్త్రవేత్తల కృషి ఉన్నప్పటికీ 1926 జనవరి 24న స్కాట్లాండ్‌ దేశానికి చెందిన జాన్‌ లోగీ బేర్డ్‌ లండన్‌లోని తన ప్రయోగశాలలో మొట్టమొదటిసారిగాకదిలే బొమ్మలను (మెకానికల్‌ టెలివిజన్‌ ద్వారా) ప్రసా రం చేసి ప్రపంచాన్ని అబ్బురపరిచారు.


ఆ తర్వాత 1927లో అమెరికాకు చెందిన ఫిలో ఫార్స్‌వర్త్‌ అనే శాస్త్రవేత్త పూర్తిస్థాయి ఎలకా్ట్రనిక్‌ టెలివిజన్‌ వ్యవస్థను రూపొందించి ఆధునిక టీవీ కి బాటలు వేశారు. 1928లో బేర్త్‌ తొలి ట్రాన్స్‌- అట్లాంటిక్‌ టీవీ ప్రసారాలను ప్రారంభించారు. 1936లో బ్రిటన్‌కు చెందిన బీబీసీ ప్రపంచంలోనే తొలిసా రిగా రెగ్యులర్‌ హై-డెఫినిషన్‌ ప్రసారా లను అందుబాటులోకి తెచ్చింది. ఇక భారత్‌లో టెలివిజన్‌ ప్రస్థానం 1959 సెప్టెంబరు 15న ఢిల్లీలో ప్రయోగాత్మ కంగా మొదలైంది. అప్పటి రాష్ట్రపతి డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ ప్రసా రాలు ప్రారంభించారు. యునెస్కో సహకారంతో ఫిలిప్స్‌ సంస్థ అందించిన పరికరాలతో ఆల్‌ ఇండియా రేడియో (ఏఐఆర్‌) ఆధ్వర్యంలో కేవలం 40 కిలోమీటర్ల పరిధిలో వారంలో రెండు రోజులు, రోజుకు గంటపాటు ప్రసారాలు జరుగుతుండేవి.


1965లో రోజువారీ వార్తా ప్రసారాలు మొదలు కాగా, 1976లో రేడియో నుంచి విడిపోయి దూరదర్శన్‌గా స్వతంత్ర రూపు దాల్చిం ది. 1982 ఆగస్టు 15న తొలిసారిగా జాతీయ ప్రసారాలు, రంగుల (కలర్‌) టీవీ యుగం భారత్‌లో మొదలైందని చరిత్రకారులు తెలిపారు. 1982లో దేశ వ్యాప్తంగా లో-పవర్‌ ట్రాన్స్‌మిటర్‌ (ఎల్‌పీడీ) కేంద్రాల ఏర్పాటుతో ప్రసా రాలు మరింత విస్తృతమయ్యాయి. ఆ తర్వాత 1982లో ఏషియన్‌ గేమ్స్‌తో భారతదేశంలోకి కలర్‌ టీవీ అడుగు పెట్టి వినోద ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. ప్రస్తుతం దూరదర్శన్‌ నుంచి 4కే టీవీ యుగం మనిషిని పరుగులు పెట్టిస్తోంది.


hnk1.2.jpgపంచాయతీ ఆఫీసులే విజ్ఞాన కేంద్రాలు

ఐదు దశాబ్దాల కిందట గ్రామీణ ప్రాంతాల్లో టెలివిజన్‌ ఒక అద్భుత ప్రపంచం విజ్ఞాన యంత్రం. వ్యవసా యంలో ఆధునిక పద్ధతులు, ఆరోగ్య సూత్రాలు, వార్తల ద్వారా ప్రపంచ విశే షాలను పల్లె ప్రజలకు చేరువ చేయ డంలో నాటి దూరదర్శన్‌ పాత్ర ప్రశం సనీయం. వ్యవసాయ వార్తలు ప్రదర్శ న జరుగుతుంటే రైతులు ఎంతో శ్రద్ధ గా వినేవారు. నిజంగానే టెలివిజన్‌ నాడు ఊరూరా విజ్ఞాన వెలుగులు నింపింది. ఇంకా ప్రతీ రోజు సాయంత్రం దివంగత శాంతిస్వరూప్‌ నోట జాలువా రిన తెలుగు వార్తల ద్వారా దేశ, విదేశీ సమాచారం ప్రజల వద్దకు చేరేది. ఇంకా ఆరోగ్యం, అక్షరాస్యత, పల్స్‌ పోలియో ఆవశ్యకత, కుటుంబ నియంత్రణ, పరిశుభ్రత, అంటువ్యాధుల నివారణ, వయోజన విద్యపై గ్రామీణులలో టెలివిజన్‌ చైతన్యం నింపింది.


ఓరుగల్లు గడ్డపై దూరదర్శన్‌ వెలుగులు

తెలంగాణలో 1975 సైట్‌ ప్రయోగం ద్వారా కొన్ని ఎంపిక చేసిన జిల్లాలు, గ్రామాల్లోకి టీవీ తొలిసారిగా అడుగుపెట్టినప్పటికీ పూర్తిస్థాయి తెలుగు ప్రసారాలు మాత్రం 1977 అక్టోబరు 23న హైదరాబాద్‌ దూరదర్శ న్‌ కేంద్రం ప్రారంభంతో ప్రజలకు టీవీ అందుబాటు లోకి వచ్చింది. హైదరాబాద్‌ నుంచి ప్రసారాలు మొద లైనప్పటికీ అప్పట్లో ప్రసారాలు ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు నేరుగా అందేవి కావు. 1982లో అప్పటి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లో-పవర్‌ ట్రాన్స్‌మిటర్‌ (ఎల్‌పీటీ) రిలే కేంద్రాలను ఏర్పాటు చేయడంతో ఉమ్మడి వరంగల్‌లోని గ్రామ పంచాయతీ కార్యాల యాలు, ధనవంతుల ఇండ్లలో దూరదర్శన్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి.


వరంగల్‌ నగరంలో ముం దుగా ట్రాన్స్‌మిటర్‌ టవర్‌కేంద్రాలు ఏర్పాటైన తర్వాత ముందుగా టెలివిజన్‌లు హనుమకొండ, నక్కలగుట్ట, బాలసముద్రం, సుబేదారి, కాజీపేట, వరంగల్‌ చౌర స్తా, మట్టెవాడ, ఫోర్ట్‌ వరంగల్‌ (ఖిలా వరంగల్‌) ప్రాంతాల్లోని ఇళ్లపై పెద్దపెద్ద యాంటీనాలు వెలిసి దూరదర్శన్‌ ప్రసారాలు విస్తృతమయ్యాయి. తొలినాళ్ల లో విద్యాసంస్థలు, ప్రభుత్వ క్వార్టర్లు, కాజీపేట రైల్వే కాలనీ, నిట్‌ (అప్పటి ఆర్‌ఈసీ) క్యాంపస్‌, పోలీసు హెడ్‌క్వార్టర్‌ ఆవరణలో ప్రజలకు టీవీ ప్రసారాలు ఉచితంగా వీక్షించే అవకాశం కలిగింది. ఆ తర్వాత నెమ్మదిగా జిల్లాలోని ఇతర పట్టణాలు, పల్లెలకు టెలివిజన్‌ విస్తరించింది.


ఈ వార్తలు కూడా చదవండి:

ప్లాట్ల వేలం.. రూ.55కోట్ల ఆదాయం

స్నేహ గ్రూప్‌పై ఐటీ శాఖ మెరుపు దాడులు....16 ప్రాంతాల్లో సోదాలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 21 , 2026 | 12:35 PM