Share News

‘నషా ముక్త్‌ భారత్‌, నషా ముక్త్‌ తెలంగాణ’కు ఎస్‌ఈఏ మద్దతు

ABN , Publish Date - Nov 21 , 2026 | 11:32 AM

అలయ్‌- బలయ్‌ ఫౌండేషన్‌, విద్యార్థి నేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ‘నషా ముక్త్‌ భారత్‌, నషా ముక్త్‌ తెలంగాణ’ అవగాహన కార్యక్రమానికి సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఎస్‌ఈఏ) మద్దతు తెలిపింది.

‘నషా ముక్త్‌ భారత్‌, నషా ముక్త్‌ తెలంగాణ’కు ఎస్‌ఈఏ మద్దతు
Nasha Mukt Bharat

హైదరాబాద్‌ సిటీ: అలయ్‌- బలయ్‌ ఫౌండేషన్‌, విద్యార్థి నేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ‘నషా ముక్త్‌ భారత్‌, నషా ముక్త్‌ తెలంగాణ’ అవగాహన కార్యక్రమానికి సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఎస్‌ఈఏ) మద్దతు తెలిపింది. ఈ మేరకు హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌ మాజీ గవర్నర్‌, అలయ్‌-బలయ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు బండారు దత్తాత్రేయకు ఎస్‌ఈఏ సభ్యులు శుక్రవారం లేఖను అందజేశారు. ఎస్‌ఈఏ సభ్యులు గోపాల్‌ కాఠి, ఫణి కుమార్‌, సత్యబోడ, దుర్గాప్రసాద్‌, సందీప్‌ రాజనాలఈ లేఖను రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి డి.చక్రపాణి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ప్రొ.మురళీమనోహర్‌ సమక్షంలో ఈ లేఖను ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఎస్‌ఈఏ కన్వీనర్‌గా, అధీకృత ప్రతినిధిగా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సందీప్‌ రాజనాలను నియమించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ప్లాట్ల వేలం.. రూ.55కోట్ల ఆదాయం

స్నేహ గ్రూప్‌పై ఐటీ శాఖ మెరుపు దాడులు....16 ప్రాంతాల్లో సోదాలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 21 , 2026 | 11:32 AM