Share News

వీళ్లు సచిన్‌ను కూడా పక్కన పెడతారు.. టీమిండియా మేనేజ్‌మెంట్‌పై కైఫ్ విమర్శలు..

ABN , Publish Date - Nov 21 , 2026 | 11:25 AM

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌కు చోటు కల్పించకపోవడంపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

వీళ్లు సచిన్‌ను కూడా పక్కన పెడతారు.. టీమిండియా మేనేజ్‌మెంట్‌పై కైఫ్ విమర్శలు..
Mohammad Kaif

ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌కు చోటు కల్పించకపోవడంపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. 'ఒకటి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైతేనే అనుభవజ్ఞులైన ఆటగాళ్లను పక్కన పెడతారా? వీళ్లు సచిన్ టెండూల్కర్‌ను కూడా జట్టు నుంచి తప్పించేవారేమో' అని కైఫ్ వ్యాఖ్యానించాడు. సిరాజ్, రవీంద్ర జడేజా వంటి సీనియర్ ఆటగాళ్లకు జట్టు యాజమాన్యం తగిన గౌరవం ఇవ్వడం లేదని విమర్శించాడు (Mohammad Kaif about Mohammed Siraj).


తొలి టెస్టులో భారత జట్టు ఎంపిక గురించి కైఫ్ (Mohammad Kaif) తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడాడు. 'ఇంగ్లండ్ పర్యటనలో అద్భుతంగా బౌలింగ్ చేసిన సిరాజ్‌ను ఇలా పక్కన పెట్టడం సరికాదు. ఒక సిరీస్‌లో వికెట్లు తక్కువగా తీసినంత మాత్రాన ఆటగాడి సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయకూడదు. ప్రస్తుత టీమ్ మేనేజ్‌మెంట్ రెండు మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన ఆటగాళ్లను కూడా పక్కన పెడుతోంది. ఇప్పటి పద్ధతి ప్రకారం.. సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజ ఆటగాడిని కూడా ఒకటి రెండు సిరీస్‌ల తర్వాత జట్టు నుంచి తప్పించేవారు' అని కైఫ్ పేర్కొన్నాడు (IND vs NZ Test).


'అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రతి ఆటగాడికి మంచి, చెడు రోజులు ఉంటాయి. గతంలో జట్టు కోసం చేసిన సేవలు, అనుభవం, మ్యాచ్‌లు గెలిపించిన ప్రదర్శనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను పక్కన పెట్టడం కూడా సరైన నిర్ణయం కాదు. ఇంగ్లండ్ పర్యటనలో జడేజా బ్యాటింగ్‌లోనూ అద్భుతంగా రాణించాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో 516 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. సీనియర్లు అయిన సిరాజ్, జడేజాల అనుభవాన్ని కచ్చితంగా ఉపయోగించుకోవాలి' అని కైఫ్ సూచించాడు.


ఇవి కూడా చదవండి..

భారత్‌ను చూసి నేర్చుకోండి.. అమెరికా వడ్డీ రేట్లపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..


స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Nov 21 , 2026 | 11:25 AM