భారత్‌ను చూసి నేర్చుకోండి.. అమెరికా వడ్డీ రేట్లపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
ABN , Publish Date - Nov 21 , 2026 | 07:32 AM
అమెరికా అధ్యక్షుడు తమ దేశ కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్ రిజర్వ్‌పై విమర్శలు గుప్పించారు. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటంతో దేశ ఆర్థిక వృద్ధికి ఆటంకం కలుగుతోందని ఆరోపించారు. ఇదే సమయంలో భారత్‌ను ఉదాహరణగా చూపిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు తమ దేశ కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్ రిజర్వ్‌పై విమర్శలు గుప్పించారు. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటంతో దేశ ఆర్థిక వృద్ధికి ఆటంకం కలుగుతోందని ఆరోపించారు. ఇదే సమయంలో భారత్‌ను ఉదాహరణగా చూపిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో తక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయని, ఏడు శాతం ఆర్థిక వృద్ధి నమోదవుతోందని ప్రశంసించారు. అమెరికా కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తే 15 నుంచి 20 శాతం వరకు జీడీపీ వృద్ధి సాధించవచ్చని వ్యాఖ్యానించారు (Donald Trump Interest Rates).
వైట్‌హౌస్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ట్రంప్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సంస్థ రాజకీయ ప్రభావంతో పనిచేస్తోందని విమర్శించారు. ఆర్థిక గణాంకాలు మెరుగ్గా ఉన్న సమయంలో వడ్డీ రేట్లను తగ్గించాల్సింది పోయి పెంచడం ఏమిటని ప్రశ్నించారు. దేశ ఆర్థిక పరిస్థితి బలంగా ఉన్నప్పుడు అప్పులు తీసుకునేవారికి ఖర్చు తగ్గించాలని, కానీ అమెరికా కేంద్ర బ్యాంకు అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం జరుగుతోందని అన్నారు (US Economy).
భారత్‌లో తక్కువ వడ్డీ రేట్లు ఉన్నప్పటికీ ఏడు శాతం స్థాయిలో జీడీపీ వృద్ధి నమోదవుతోందని ప్రశంసించారు (India GDP Growth). భారత్‌ను చూడాలని, అక్కడి ఆర్థిక వృద్ధిని గమనించాలని అమెరికా విధాన నిర్ణేతలకు సూచించారు. అమెరికా ప్రపంచంలోనే అత్యల్ప వడ్డీ రేట్లు కలిగిన దేశంగా ఉండాలని అన్నారు. ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలు విజయవంతం కావడానికి అమెరికా కీలక పాత్ర పోషిస్తోందని, అలాంటి అమెరికాకే అత్యల్ప వడ్డీ రేట్లు ఉండాలని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గిస్తే 14 నుంచి 20 శాతం వరకు ఆర్థిక వృద్ధి సాధించవచ్చని ఆయన అన్నారు. ప్రస్తుతం అమెరికాలో సుమారు నాలుగు శాతం వృద్ధి నమోదవుతోంది.
ఈ వార్తలనూ చదవండి:
వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!
ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..