Share News

రిషభ్ పంత్ సరికొత్త చరిత్ర.. తొలి వికెట్ కీపర్-బ్యాటర్‌గా రికార్డ్

ABN , Publish Date - Nov 21 , 2026 | 12:07 PM

డబ్ల్యూటీసీ చరిత్రలో భారత వికెట్‌కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఇవాళ న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు మూడో సెషన్‌లో55 పరుగులు చేయడంతో.. 3000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. దీంతో 3,000 పరుగుల మార్కును దాటిన తొలి వికెట్‌ కీపర్, బ్యాటర్‌గా పంత్ నిలిచాడు.

రిషభ్ పంత్ సరికొత్త చరిత్ర.. తొలి వికెట్ కీపర్-బ్యాటర్‌గా రికార్డ్
Rishabh Pant

స్పోర్ట్స్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ 2025-27) చరిత్రలో భారత వికెట్‌కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఇవాళ(శనివారం) న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు మూడో సెషన్‌లో 55 పరుగులు చేయడంతో 3000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. దీంతో వికెట్‌ కీపర్, బ్యాటర్‌గా 3,000 పరుగుల మార్కును దాటిన తొలి ఆటగాడిగా పంత్ నిలిచాడు.


గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన పంత్.. ఈ టెస్టుకు ముందు 2,948 పరుగులతో ఉండగా.. 3 వేల పరుగులకు 52 పరుగులు అవసరమయ్యాయి. కేవలం 55 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేయడంతో పాటు 3 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 54 బంతుల్లో 48 పరుగులతో ఉన్న పంత్.. బౌండరీ బాది 52 అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 62 బంతుల్లో 55 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతకుముందు డబ్ల్యూటీసీలో భాగంగా విదేశాల్లో జరిగిన మ్యాచ్‌ల్లో 2,000 పరుగులు పూర్తి చేసిన తొలి, ఏకైక భారత క్రికెటర్‌గానూ పంత్ రికార్డు సృష్టించాడు.


మరోవైపు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా మూడో రోజు డబ్ల్యూటీసీలో 3,000 పరుగుల క్లబ్‌లో చేరాడు. ఈ మ్యాచ్‌కు ముందు 2,917 పరుగులతో ఉన్న గిల్.. 83 పరుగులు చేసి..మూడు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో 146 బంతుల్లో 98 పరుగుల వద్ద ఔటైన గిల్ తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఓవరాల్‌గా డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రూట్‌ కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో గిల్‌ 12వ స్థానంలో కొనసాగుతున్నాడు. మొత్తంగా పంత్, గిల్ జోరుతో బేసిన్ రిజర్వ్ వేదికగా భారత్ పట్టు బిగించింది.


ఇవి కూడా చదవండి:

వీళ్లు సచిన్‌ను కూడా పక్కన పెడతారు.. టీమిండియా మేనేజ్‌మెంట్‌పై కైఫ్ విమర్శలు..

రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలుకొట్టిన పడిక్కల్..

Updated Date - Nov 21 , 2026 | 12:15 PM