Share News

రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలుకొట్టిన పడిక్కల్..

ABN , Publish Date - Nov 21 , 2026 | 11:08 AM

వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దేవదత్ పడిక్కల్ 80 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలోనే టీమిండియా క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ రికార్డును అధిగమించాడు.

రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలుకొట్టిన పడిక్కల్..
Devdutt Padikkal

స్పోర్ట్స్ డెస్క్: వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. టాపార్డర్‌ మొత్తం భారీగా పరుగులు సాధిస్తున్నారు. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (136) సూపర్‌ సెంచరీతో రాణించగా యశస్వి జైస్వాల్‌ (85), దేవదత్‌ పడిక్కల్‌ (80) సెంచరీలకు చేరువలో పెవిలియన్ చేరారు. ఈ క్రమంలో పడిక్కల్ టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేశాడు.


వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్ మైదానం టెస్టుల్లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన భారత ఆటగాళ్లలో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు సాధించిన జాబితాలో రెండో స్థానానికి చేరాడు. పడిక్కల్ 175 బంతుల్లో 80 పరుగులు చేశాడు. గతంలో ఈ స్థానంలో ఉన్న రాహుల్ ద్రవిడ్‌ను వెనక్కి నెట్టాడు. 2002లో ద్రవిడ్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 173 బంతుల్లో 76 పరుగులు చేశాడు. అజిత్ వాడేకర్ 143 పరుగుల(1968)తో తొలిస్థానంలో ఉన్నాడు.


ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 122 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 476 పరుగులు చేసింది. ప్రస్తుతం శుభ్‌మన్‌ గిల్‌ 97 పరుగులతో కొనసాగిస్తుండగా.. అతడికి జతగా రిషబ్‌ పంత్‌ (48) క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ 110 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. హెన్రీ నికోల్స్‌ (175 నాటౌట్‌), గ్లెన్‌ ఫిలిప్స్‌ (118) సెంచరీలతో అదరగొట్టారు. భారత బౌలర్లలో బుమ్రా 4, ఆకాశ్‌దీప్‌ 3, అన్షుల్‌ కంబోజ్‌ 2, ప్రసిద్ద్‌ కృష్ణ ఓ వికెట్‌ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

డ్రెస్సింగ్ రూమ్ లీకుల ఆరోపణలతో కుంగిపోయా: సర్ఫరాజ్‌

2026లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పాక్ స్టార్..

Updated Date - Nov 21 , 2026 | 11:19 AM