Share News

కేఎల్‌ రాహుల్‌ అరుదైన ఘనత.. మూడో భారత ఓపెనర్‌గా రికార్డు!

ABN , Publish Date - Nov 21 , 2026 | 06:57 AM

టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రాహుల్ సెంచరీ సాధించాడు.

కేఎల్‌ రాహుల్‌ అరుదైన ఘనత.. మూడో భారత ఓపెనర్‌గా రికార్డు!
KL Rahul

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రాహుల్ సెంచరీ సాధించాడు. ఆరంభంలో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రాహుల్‌.. ఆ తర్వాత కివీస్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో రాహుల్ అరుదైన ఘనత సాధించాడు.


కేఎల్ రాహుల్ తన అద్భుత ప్రదర్శనతో ఒక డబ్ల్యూటీసీ(2025-27) సైకిల్‌లో భారత్ తరపున 1000+ పరుగులు చేసిన మూడో ఓపెనర్‌గా నిలిచాడు. రాహుల్ కంటే ముందు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్‌గా భారత్ తరఫున రాహుల్ ఐదో స్థానంలో నిలిచాడు. అజింక్య రహానే (2019 - 21) తొలి స్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ (2019 - 21), యశస్వి జైస్వాల్ (2023 - 25), శుభ్‌మన్ గిల్ (2025 - 27), కేఎల్ రాహుల్ (2025 - 27)లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అలానే టెస్టు క్రికెట్‌లో సేనా ( దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలన్నింటిలోనూ అర్ధ సెంచరీ సాధించిన తొలి భారత ఓపెనర్‌గా రాహుల్ చరిత్ర సృష్టించాడు. అదేవిధంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక ఫిప్టీ ప్లస్‌ స్కోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రాహుల్(17) రోహిత్ శర్మతో కలిసి ఐదో స్ధానంలో నిలిచాడు.


సయీన్ అన్వర్ రికార్డును రాహుల్ సమం

అలానే తన శతకంతో కేఎల్ రాహుల్ ఒక గొప్ప ఘనతను సాధించాడు. సేనా దేశాల్లోనూ శతకాలు సాధించిన ఆసియా బ్యాటర్ల జాబితాలో చేరాడు. అయితే ఓపెనర్‌గా ఈ ఘనతను సాధించిన పాకిస్థాన్ దిగ్గజం సయీన్ అన్వర్ రికార్డును కూడా రాహుల్ సమం చేశాడు.

సేనా దేశాలపై సెంచరీ చేసిన ఆసియా బ్యాటర్లు

  • మహ్మద్ అజారుద్దీన్

  • సచిన్ టెండూల్కర్

  • సయీద్ అన్వర్

  • రాహుల్ ద్రవిడ్

  • యూనిస్ ఖాన్

  • కుమార్ సంగక్కర

  • విరాట్ కోహ్లీ

  • KL రాహుల్


కాగా వెల్లింగ్టన్ టెస్టులో పటిష్ఠమైన స్థితిలో నిలిచింది. మూడో రోజు ఆటలో భార‌త్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 74 ఓవర్లకు కేవలం వికెట్ కోల్పోయి 265 పరుగులు చేసింది. భారత్‌ ఇంకా కివీస్ కంటే ఇంకా 103 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం క్రీజులో రాహుల్(102), పడిక్కల్(66) ఉన్నారు. అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగుల భారీ స్కోర్ సాధించి ఆలౌటైంది.


ఈ వార్తలనూ చదవండి:

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!

ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..

Updated Date - Nov 21 , 2026 | 07:10 AM