Share News

అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టు

ABN , Publish Date - Nov 21 , 2026 | 06:57 AM

మనదేశంలో గుట్టుచప్పుడు కాకుండా పనిచేస్తూ అమెరికాకు మాదకద్రవ్యాలను తరలిస్తున్న అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాను అధికారులు పట్టుకున్నారు.

అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టు

  • దేశవ్యాప్తంగా ఆరుగురు ముఠా సభ్యుల అరెస్టు

హైదరాబాద్‌, నవంబర్‌ 20(ఆంధ్రజ్యోతి): మనదేశంలో గుట్టుచప్పుడు కాకుండా పనిచేస్తూ అమెరికాకు మాదకద్రవ్యాలను తరలిస్తున్న అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాను అధికారులు పట్టుకున్నారు. ఇండియన్‌ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, అమెరికా డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌ సంయుక్తంగా నిర్వహించిన ‘ఆపరేషన్‌ మాన్‌సూన్‌ థండర్‌’ ద్వారా ఈ ముఠా గుట్టును రట్టు చేశారు.


హైదరాబాద్‌, ఢిల్లీ, కోల్‌కతా, లక్నోలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 4 నుంచి 13 వరకు జరిపిన దాడుల్లో ఆరుగురు ముఠా సభ్యులను అరెస్ట్‌ చేసినట్లు ఎన్‌సీబీ అధికారులు తెలిపారు. ఈ ముఠా 2022 జూన్‌ నుంచి ఇప్పటివరకు అమెరికా వ్యాప్తంగా 3,000 పార్సిళ్ల ద్వారా దాదాపు 5 లక్షల సైకోట్రోపిక్‌, ఓపియాయిడ్‌ టాబ్లెట్లను సరఫరా చేసినట్లు గుర్తించారు.


ఇవి కూడా చదవండి...

మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఈడీ సోదాలు

కాంగ్రెస్ మంత్రులకు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి రిక్వెస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 21 , 2026 | 06:57 AM