Share News

జంట నక్షత్రాలపై పరిశోధన.. రవిరాజా పోతినేనికి ఓయూ డాక్టరేట్‌

ABN , Publish Date - Nov 21 , 2026 | 06:54 AM

అంతరిక్షంలో జంట నక్షత్రాలపై (బైనరీ స్టార్స్‌) పరిశోధన పూర్తి చేసిన డాక్టర్‌ రవిరాజా పోతినేని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఖగోళశాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా పొందేందుకు అర్హత సాధించారు.

జంట నక్షత్రాలపై పరిశోధన.. రవిరాజా పోతినేనికి ఓయూ డాక్టరేట్‌

ఉస్మానియా యూనివర్సిటీ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): అంతరిక్షంలో జంట నక్షత్రాలపై (బైనరీ స్టార్స్‌) పరిశోధన పూర్తి చేసిన డాక్టర్‌ రవిరాజా పోతినేని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఖగోళశాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా పొందేందుకు అర్హత సాధించారు. ఓయూ పరీక్షల విభాగం ఈ వివరాలు వెల్లడించింది. ఖగోళశాస్త్ర విభాగం ప్రొఫెసర్‌ డి.శాంతిప్రియ పర్యవేక్షణలో ‘ఇన్వెస్టిగేటివ్‌ స్టడీస్‌ ఆఫ్‌ క్లోజ్‌ బైనరీస్‌ విత్‌ ది పాసిబిలిటీ ఆఫ్‌ అడిషనల్‌ టెర్షియరీ కాంపోనెంట్స్‌/ఎక్సోప్లానెట్స్‌’ అంశంపై రవిరాజా పోతినేని పరిశోధన చేశారు. ఒకదాని చుట్టూ మరొకటి పరిభ్రమించే జంట నక్షత్రాల కాంతిలో వక్రతలు, వర్ణపట దత్తాంశాలను విశ్లేషించి.. వాటి కక్ష్య కాలంలో చోటుచేసుకునే సూక్ష్మ మార్పులను అధ్యయనం చేశారు.


ఈ మార్పుల ఆధారంగా ఆ జంట తారల చుట్టూ మూడో తార ఉండే అవకాశాలను, వాటి పరిణామ క్రమాన్ని అన్వేషించారు. ఇందుకోసం జాతీయ, అంతర్జాతీయ అంతరిక్ష పరిశీలన కేంద్రాల ద్వారా డేటా సేకరించారు. ఈ పరిశోధనకు సంబంధించి అంతర్జాతీయ ఖగోళశాస్త్ర పత్రికల్లో ఆరు పరిశోధనా వ్యాసాలను ప్రచురించారు. మరోవైపు పరిశోధనతో పాటు విజ్ఞాన ప్రచారంలోనూ రవిరాజా చురుకుగా పాల్గొంటున్నారు. ఇప్పటివరకు 50 వేల మందికిపైగా విద్యార్థులు, ప్రజలకు ఖగోళశాస్త్రంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తన పరిశోధనకు మార్గదర్శకత్వం వహించిన ప్రొఫెసర్‌ శాంతి ప్రియతో పాటు ఓయూ వీసీ, రిజిస్ట్రార్‌లకు రవిరాజా కృతజ్ఞతలు తెలిపారు.


ఈ వార్తలనూ చదవండి:

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!

ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..

Updated Date - Nov 21 , 2026 | 06:54 AM