Share News

2026లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పాక్ స్టార్..

ABN , Publish Date - Nov 21 , 2026 | 08:07 AM

శ్రీలంక‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో 8 వికెట్లు ప‌డ‌గొట్టిన పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మొహ‌మ్మ‌ద్ అబ్బాస్ 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌', 'ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్‌' అవార్డు ద‌క్కించుకున్నాడు. ఈ నేప‌థ్యంలోనే అబ్బాస్ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

2026లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పాక్ స్టార్..
Mohammad Abbas

స్పోర్ట్స్ డెస్క్: శ్రీలంక‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో 8 వికెట్లు ప‌డ‌గొట్టిన పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మొహ‌మ్మ‌ద్ అబ్బాస్ 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌', 'ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్‌' అవార్డు ద‌క్కించుకున్నాడు. ఈ నేప‌థ్యంలోనే అబ్బాస్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. 2026లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా తొలి స్థానంలో నిలిచాడు. ఇప్ప‌టివ‌ర‌కు మొహ‌మ్మ‌ద్ అబ్బాస్ 39 వికెట్లు ప‌డ‌గొట్టాడు.


2026లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా జాబితాలో ఇంగ్లండ్ బౌల‌ర్ జోష్ టంగ్ (33 వికెట్లు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ (32 వికెట్లు) మూడో స్థానంలో ఉన్నాడు. బంగ్లా బౌల‌ర్ మెహిది మిరాజ్ (28 వికెట్లు), ఓలీ రాబిన్స‌న్ (28 వికెట్లు), హ‌స‌న్ మ‌హ్ముద్ (27 వికెట్లు) త‌ర్వాతి స్థానాల్లో కొన‌సాగుతున్నారు. మరోవైపు డ‌బ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌లో లీడింగ్ వికెట్ టేక‌ర్‌గా ఆస్ట్రేలియా బౌల‌ర్ మిచెల్ స్టార్క్ కొన‌సాగుతున్నాడు. స్టార్క్ 73 వికెట్లతో తొలి స్థానంలో ఉన్నాడు.


ఇంగ్లండ్ బౌల‌ర్ జోష్ టంగ్ 64 వికెట్లతో రెండో స్థానంలో, దక్షిణాఫ్రికా బౌల‌ర్ సిమోన్ హార్మ‌ర్ (50 వికెట్లు) మూడో స్థానంలో ఉన్నారు.భార‌త బౌల‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ (43 వికెట్లు), ఇంగ్లండ్ స్టార్ జోఫ్రా ఆర్చ‌ర్ (41 వికెట్లు) నాలుగు, ఐదో స్థానాల్లో, విండీస్ బౌల‌ర్ ష‌మ‌ర్ జోసెఫ్ (40 వికెట్లు) ఆరో స్థానంలో కొనసాగుతున్నారు. 2026లో లీడింగ్ వికెట్ టేక‌ర్‌గా ఉన్న మొహమ్మ‌ద్ అబ్బాస్ 39 వికెట్ల‌తో ఏడో స్థానంలో నిలిచాడు. ఇక రెండో టెస్టులో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది.


ఈ వార్తలు కూడా చదవండి:

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రోడ్లు!

22 నుంచి ఎస్‌ఐ పరీక్షల అభ్యర్థులకు హాల్‌ టికెట్లు

Updated Date - Nov 21 , 2026 | 08:07 AM