Share News

22 నుంచి ఎస్‌ఐ పరీక్షల అభ్యర్థులకు హాల్‌ టికెట్లు

ABN , Publish Date - Nov 21 , 2026 | 06:48 AM

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగ పరీక్షకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులు హాల్‌ టికెట్లను ఈనెల 22వ తేదీ ఉదయం నుంచి తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు తెలిపారు.

22 నుంచి ఎస్‌ఐ పరీక్షల అభ్యర్థులకు హాల్‌ టికెట్లు

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగ పరీక్షకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులు హాల్‌ టికెట్లను ఈనెల 22వ తేదీ ఉదయం నుంచి తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 29న ఎస్‌ఐ అభ్యర్థులకు ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహిస్తున్నామని ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. 335 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని వివరించారు.


హాల్‌ టికెట్లను 28వ తేదీ అర్ధరాత్రి 12గంటల వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని, అభ్యర్థులు ఫోన్‌ నంబర్‌ ద్వారా లాగిన్‌ అవ్వచ్చని, డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌ టికెట్‌పై తమ ఫొటో అతికించాలని సూచించారు. ఫొటో అతికించకున్నా, పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని, అభ్యర్థులు హ్యాండ్‌బ్యాగులు, ఫోన్లు తేవద్దని స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఈడీ సోదాలు

కాంగ్రెస్ మంత్రులకు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి రిక్వెస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 21 , 2026 | 06:48 AM