ఏసీపీ పోస్టులు భర్తీ చేసేదెన్నడో?
ABN , Publish Date - Nov 24 , 2026 | 10:27 AM
వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు పూర్తిస్థాయి ఏసీపీలు కరువయ్యారు. దీంతో ఇన్చార్జిలతో నెట్టుకొస్తున్నారు. ఒక్కొక్క అధికారికి రెండు పోలీస్ డివిజ న్ల పర్యవేక్షణ అప్పగించారు.
8 నెలలుగా ఖాళీగానే...
ఇన్చార్జిలతో నెట్టుకొస్తున్న వైనం
వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు పూర్తిస్థాయి ఏసీపీలు కరువయ్యారు. దీంతో ఇన్చార్జిలతో నెట్టుకొస్తున్నారు. ఒక్కొక్క అధికారికి రెండు పోలీస్ డివిజ న్ల పర్యవేక్షణ అప్పగించారు. పోలీస్ స్టేష న్ల పనితీరుపై సమీక్ష, క్లిష్టమైన కేసుల తో పాటు పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల దర్యాప్తు, వివిధ రాజకీయ సభలకు అనుమతు లు, ఉన్నతాధికారుల ద్వారా వచ్చే కీలకమైన సమాచారాన్నిస్టేషన్ అధికారులకు చేరవేయడంలో ఏసీపీల పాత్ర కీలకం. అలాంటిది కమిషనరేట్ లో కీలకమైన మూడు ఏసీపీ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఆయా విభాగాల పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతోంది.
8 నెలలుగా ఇన్‌చార్జిలే...
వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లోని వరంగల్, జనగామ ఏసీపీలుగా పనిచేసిన ఏఎస్పీలు శుభం ప్రకాశ్, చేతన్ నితిన్‌లు బదిలీ అయి సుమారు 8 నెల లు పూర్తైంది. అయినా ఇప్పటి వరకు పూర్తి స్థాయి ఏసీపీలను నియమించలే దు. హనుమకొండ ఏసీపీ నరసింహరావుకు వరంగల్ ఏసీపీగా అదనపు బాధ్యతలు అప్పగించగా, స్టేషన్‌ఘన్‌పూర్ ఏసీపీ భీంశర్మకు జనగామ ఏసీపీ గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
వరంగల్, జనగామ పోలీస్ డివిజన్లలో జనాభా రద్దీతోపాటు క్లిష్టమైన కేసు ల నమోదు తీవ్రత అధికంగా ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో జాప్యం చేయకుండా తక్షణమే ఏసీపీలను నియమించి పోలీస్ స్టేషన్లపై పర్యవేక్షణ కొనసాగించేలా పోలీసు ఉన్నతాధికారులు చర్చలు చేపట్టాల్సిన అసవరం ఉంది. రెండు పోలీస్ డివిజన్లతో పాటు ఆగస్టులో ఎస్బీ(స్పెషల్ బ్రాంచి) ఏసీపీ మూల జితేందర్‌రెడ్డి పదవీ విరమణ చేయగా ఆ స్థానంలో టాస్క్‌ఫోర్స్ ఏసీపీగా పనిచేస్తున్న మధుసూదన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. పోలీస్ కమిషనరేట్‌కు టాస్క్‌ఫోర్స్, ఎస్బీ రెండు కీలకమే. అలాంటి స్ధానాల్లో సైతం ఖాళీని నింపకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని చర్చ జరుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
పసిడి ధరల్లో మళ్లీ పెరుగుదల.. నేడు ఎలా ఉన్నాయంటే..
కరీంనగర్ వైద్య కాలేజీ నిర్మాణంలో జాప్యమేంటి?
Read Latest AP News And Telangana News And International News And Telugu News