Share News

కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

ABN , Publish Date - Nov 24 , 2026 | 10:05 AM

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు.

కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, పవన్ కల్యాణ్
CM Chandrababu Naidu and Deputy CM pawan kalyan

అమరావతి, నవంబర్ 24: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. పౌర్ణమి వెలుగులు అందరి ఇంట్లో శుభాల వెలుగులను శాశ్వతం చేయాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. కార్తిక పౌర్ణమి నాడు ప్రతి కుటుంబానికి సంతోషాలు కలగాలని పవన్ కల్యాణ్ కోరుకున్నారు.


చంద్రబాబు పోస్ట్..

‘ఉపవాస దీక్షలతో, దీపారాధనలతో, శివనామస్మరణలతో హిందువులకు విశిష్టమైన కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని అత్యంత నిష్టగా జరుపుకుంటున్న భక్తులందరికీ శుభాకాంక్షలు. ఈనాటి పౌర్ణమి వెలుగులు, దీప కాంతులు మీ ఇంట శుభాల వెలుగులను శాశ్వతం చేయాలని కోరుకుంటున్నాను’ అంటూ ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు.


ప్రతి కుటుంబానికి సంతోషాలు కలగాలి: పవన్

‘కార్తీక పౌర్ణమి శుభసందర్భంగా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన రోజున వెలిగించే దీపాలు ప్రతి ఇంటా ఆనందాన్ని, ప్రతి హృదయంలో భక్తిని నింపాలని, ప్రతి కుటుంబానికి శాంతి, సుఖసంతోషాలు, సిరిసంపదలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.


ఇవి కూడా చదవండి...

పసిడి ధరల్లో మళ్లీ పెరుగుదల.. నేడు ఎలా ఉన్నాయంటే..

కార్తీక పౌర్ణమి శోభ.. దేశవ్యాప్తంగా పుణ్యస్నానాలకు పోటెత్తిన భక్తులు..

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 24 , 2026 | 10:09 AM