రాష్ట్ర ప్రజలకు కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి శుభాకాంక్షలు: మంత్రి నారా లోకేశ్
ABN , Publish Date - Nov 24 , 2026 | 09:30 AM
కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, గురునానక్ జయంతి సందర్భంగా సిక్కు సోదరులకు మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి, నవంబరు 24: పవిత్ర కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్.. రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సిక్కు సోదరులందరికీ గురునానక్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.
‘శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది కార్తీక పౌర్ణమి. ఈ పవిత్ర పర్వదినం మీ జీవితంలో సుఖశాంతులను, ఆయురారోగ్యాలను, ఐశ్వర్యాలను నింపాలని కోరుకుంటూ.. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అంటూ మంత్రి నారా లోకేశ్ పోస్ట్ చేశారు.
దానితో పాటు.. ‘సిక్కు మత స్థాపకులు గురునానక్ జయంతి సందర్భంగా సిక్కు సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సత్యం, అహింస, మత సామరస్యం, తోటి మనిషికి నిస్వార్థంగా సేవ చేయాలనే గురునానక్ బోధనలు ఎప్పటికీ అనుసరణీయం’ అని లోకేశ్ పేర్కొన్నారు.