Share News

కార్తీక పౌర్ణమి వేళ విషాదం.. ఆలయ దర్శనం ముగించుకుని వస్తూ ఇద్దరు అయ్యప్ప స్వాముల మృతి

ABN , Publish Date - Nov 24 , 2026 | 09:09 AM

కార్తీక పౌర్ణమి పండుగ వేళ పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. అమరావతిలో ఆలయ దర్శనం చేసుకుని ఇంటికి తిరిగి వస్తున్న ఇద్దరు అయ్యప్ప స్వాములు ఊటుకూరు సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

కార్తీక పౌర్ణమి వేళ విషాదం.. ఆలయ దర్శనం ముగించుకుని వస్తూ ఇద్దరు అయ్యప్ప స్వాముల మృతి
ayyappa devotees car accident

పల్నాడు జిల్లా, నవంబరు 24: పండుగ పూట జిల్లాలో విషాదం నెలకొంది. ఆలయ దర్శన అనంతరం ఇంటికి తిరిగి వెళ్తున్న ఇద్దరు అయ్యప్ప స్వాములు కారు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని క్రోసూరు మండలంలో గల ఊటుకూరు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..


పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని క్రోసూరు మండలానికి చెందిన దాడి పూర్ణచందర్ (50), దగ్గుబాటి శ్రీనివాస రావు అయ్యప్ప స్వామి మాల ధారణ చేశారు. సోమవారం రాత్రి అమరావతిలోని ఓ ప్రముఖ ఆలయంలో నిద్ర చేయడానికి వెళ్లారు. రాత్రంతా.. దైవ సన్నిధితో నిద్ర చేసి.. దర్శన పూజాది కార్యక్రమాల అనంతరం.. కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ఊటుకూరు గ్రామ సమీపంలో కారు ప్రమాదానికి గురైంది. దీంతో పూర్ణచందర్, శ్రీనివాస రావులకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

గమనించిన వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి సంబంధించిన వివారాలు సేకరిస్తున్నారు. కాగా.. ప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. పండుగపూట అయ్యప్ప మాలలో ఉన్న ఇద్దరు భక్తులు మృతి చెందడంతో గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

చేతులెలా వచ్చాయ్‌!

నామినీ ఉంటేనే బీమా

Updated Date - Nov 24 , 2026 | 09:09 AM